ఇఫ్తార్‌ విందులో పాల్గొనున్న వైఎస్‌ జగన్‌

6 Jul 2016


కడపలోని పెద్దదర్గా సమీపంలోని కల్యాణ మండపంలో ముస్లిములు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు ప్రతిపక్ష నేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిములందరూ రంజాన్‌ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన కోరారు. ఈ విందుకు జగన్‌తో పాటు కడప ఎంపి వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎంఎల్‌ఎ అంజాద్‌బాషా, మేయర్‌ సురేష్‌ బాబు, జడ్‌పి ఛైర్మన్‌ గూడూరు రవి, వైస్‌ ఛైర్మన్‌ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాధరెడ్డి హాజరయ్యారు. అనంతరం జగన్‌ పెద్దదర్గాకు వెళ్లి పూలఛాదర్‌ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్దదర్గా పీఠాధిపతి హజరత్‌ సయ్యద్‌షా హుస్సేనీతో ఏకాంతంగా సమావేశమయ్యారు. అంతకుముందు మున్సిపాలిటీలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు.

YSRCP leader YS Jagan is participating in Iftar in Kudapa Massed.