మరో మాఫీ జిమ్మిక్కు

1 Jul 2016


రైతుల రుణమాఫీపై గడచిన రెండేళ్లలో అనేక విన్యాసాలు ప్రదర్శించిన చంద్రబాబు సర్కారు తాజాగా మరొక జిమ్మిక్కుకు తెర తీసింది. రైతులకు చెల్లించాల్సిన రెండో కిస్తీకి నిధులు అందుబాటులో లేకపోయినా, ఆర్థిక శాఖ బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ (బిఆర్‌వొ) ఇవ్వకపోయినా, వ్యవసాయశాఖ రూ.2360,41,71,000 కోట్లను మంజూరు చేస్తూ బుధవారం పరిపాలనా ఆమోదం ఇచ్చేసింది. ఆ మేరకు జివొఆర్‌టి నెం.446ను వెలువరించింది. అడ్మినిస్ట్రేషన్‌ బిజినెస్‌ రూల్స్‌కు విరుద్ధంగా, కేవలం కంటి తుడుపు కోసమే ఈ జీవో ఇచ్చినట్లు ఆరోపణలొస్తున్నాయి. రెండో కిస్తీకి సంబంధించి రైతులకు రుణ మాఫీ ద్రువీకరణ పత్రాల పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22న ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించారు.

సిఎం చేసిన ఆర్భాటంతో రైతులు సర్టిఫికెట్లు పట్టుకొని బ్యాంకులకు పరుగులు తీయగా ఇంకా డబ్బులు రాలేదని అధికారులు సమాధానం ఇస్తున్నారు. ఖరీఫ్‌ ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న తరుణంలో పెట్టుబడుల కోసం వెతుక్కుటుంటున్న అన్నదాతలు రెండో కిస్తీ అయినా చేతికి అందుతుందని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మరో పక్క సిఎం ఈ ఏడాది ఖరీఫ్‌ పనులకు శుభసూచకంగా ఎంతో అట్టహాసంగా జూన్‌ 20న ఏరువాకను ప్రారంభించారు. రుణమాఫీ రెండో కిస్తీ చెల్లింపులకు పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయలేదు. దీంతో రైతుల్లో నిరసన వ్యక్తమవుతోంది

ఈ నేపథ్యంలో రైతులను మభ్యపెట్టే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. మాఫీకి సుమారు రూ.2,360 కోట్లు ఇచ్చేసినట్లు వ్యవసాయశాఖ నుంచి హడావుడిగా బుధవారం జీవో ఇప్పించింది. వాస్తవానికి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా బడ్జెట్‌ నిధులను విడుదల చేసే అధికారం ఏ ప్రభుత్వ శాఖకూ లేదు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిధులను విడుదల చేస్తూ ఆర్థికశాఖ తొలుత బిఆర్‌వొ ఇస్తుంది. తదుపరి ఆయా ప్రభుత్వ శాఖలు పరిపాలనా ఆమోదం ఇస్తాయి. మాఫీ విషయంలో వ్యవహారం తిరగబడింది. నిధులు అందుబాటులో లేవంటూ మాఫీ నిధులకు ఆర్థిక శాఖ బ్రేక్‌ వేసింది. బిఆర్‌వొ ఫైలు సిద్ధమైనప్పటికీ జివో ఇవ్వలేదు. కాగా ముందే కోయిల కూసినట్లు వ్యవసాయశాఖ కనీసం ఆర్థిక శాఖ ప్రస్తావన లేకుండానే నిధుల విడుదలకు పరిపాలనా ఆమోదం ఇచ్చింది.

మాఫీ చేసేశామని రైతులను మభ్యపెట్టేందుకే సాధారణ బిజినెస్‌ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవసాయశాఖ జీవో ఇచ్చినట్లు విమర్శలొస్తున్నాయి. ఇదిలా ఉండగా రుణమాఫీ రెండో కిస్తీ కోసం 2015-16 బడ్జెట్‌లో రూ.4,300 కోట్లు ప్రతిపాదించగా ఒక్క రూపాయి ఇవ్వలేదు. 2016-17 బడ్జెట్‌లో రూ.3,512 కోట్లు ప్రతిపాదించగా ఆ నిధులు మంజూరు చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 25న వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభం రోజున సిఎం తొలి సంతకం చేశారు. అనంతరం మే 6న ఆర్థిక శాఖ రూ.వెయ్యి కోట్లకు బిఆర్‌వొ ఇస్తూ జివొఆర్‌టి నెం.1347 జారీ చేసింది. బిఆర్‌వొ ఇచ్చిన తర్వాత కూడా కొరత పేరుతో నిధులు విడుదల చేయలేదు. ఎప్పటికో రైతు సాధికార సంస్థకు నిధులు బదలాయించారు. ఇంకా పంపిణీ చేయలేదు. ఇదిలా ఉండగానే బుధవారం ఆర్థిక శాఖకు తెలీకుండానే వ్యవసాయశాఖ ఏకంగా రూ.2,3460 కోట్లకు పరిపాలనా ఆమోదం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

AP CM Chandrababu Naidu is cheating people with fack runa maafi. At the time of election campaign he told one lack runa maafi for family. But did not do it till now.