హైదరాబాద్ కి వెళ్ళిపోతున్న ఏపీ ఉద్యోగులు..

1 Jul 2016


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కొత్త రాజధాని అమరావతి కి ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగుల తరలింపు ప్రక్రియ ఇబ్బంది కరంగా మారుతోంది జూన్ 27 నాటికి గుంటూరు, విజయవాడ లలో ఆయా ప్రాంతాల్లో ప్రతీ శాఖ కీ చెందిన అధిపతులు కార్యాలయాలకి వెళ్ళాల్సిందే అని సర్కారు ఆదేశాలు జారీ చెయ్యడం తో ఆ తరలింపులు జరిగాయి. కానీ అవి తూతూ మంత్రంగా జరుగుతున్నాయి అనే విమర్శలు వినపడుతున్నాయి.

గుంటూరు, విజయవాడ లలో అద్దె భవనాలకి వెళ్లి కొబ్బరి కాయ కొట్టిన ఉద్యోగులు వెంటనే హైదరాబాద్ వచ్చెయ్యడం ఆశ్చర్యకర విషయం. అద్దెకి తీసుకున్న ఆ భవనాలలో పని చెయ్యడం కొస౦ చాలా మార్పులు జరుగుతున్నాయి అనీ దానికి చాలా సమయం పడుతుంది అనీ అందుకే ఇలోగా తమ ఇళ్ళకు – హైదరాబాద్ చేరుకున్నాం అని అంటున్నారు వారు. పని చేసే వాతావరణం ఏ మాత్రం లేని చోట హడావిడి గా కంగారు పెట్టి వచ్చేయ్యమంటే మాత్రాన ఎలా వచ్చి పనిచేస్తాం అని వాపోతున్నారు ఉద్యోగులు.

మీడియా ముందర ఎక్కడా బయటకి చెప్పకపోయినా వారి ఇంటర్నల్ ఫీలింగ్ ఇదే అని తెలుస్తోంది. వెలగపూడి లో తాత్కాలిక సచివాలయం గురించి ఇక చెప్పక్కర్లేదు. ముహూర్తం అంటూ జూన్ 29 న అక్కడికి చేరుకున్న ఉద్యోగులు కొబ్బరి కాయ కొట్టి వెళ్ళిపోయారు. ఆ సచివాలయం నిండా బురద గందరగోళంగా ఉంది. అందులో అడుగుపెట్టడానికి కూడా దాదాపు నెల రోజులు పట్టేలా ఉంది పరిస్థితి

ప్రధాన భూ పరిపాలన కార్యాలయం కోసం గొల్లపూడి లో ఒక భవనాన్ని అద్దెకు తీసుకున్నారు ఆ శాఖ వారు. సీసీఎల్ ఏ వారిలో కొందరు అధికారులు ఆ భవనం లోకి గత బుధవారం వచ్చి కొబ్బరి కాయ కొట్టి వెంటనే హైదరాబాద్ రిటర్న్ అవడం ఆశ్చర్యకరం. ఆ ఆఫీసు మొదలు అవడం , కార్యకలాపాలు చక్కబెట్టడానికి కనీసం నెల పట్టేలా ఉండడం తో హైదరాబాద్ సీసీఎల్ఏ ఆఫీసు లోనే ఉండాలని హైదరాబాద్ చేరుకున్నారు వీరు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానిది కూడా ఇదే పరిస్థితి. ఈడుపుగల్లు లో భవనం ప్రారంభించి వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం కోసం విజయవాడలోని పాత బో ధనాసుపత్రిలో ప్రస్తుతం ఉన్న రోగులని రెండు వార్డుల వరకూ ఖాళీ చేయిస్తున్నారు. రోగులని వేరే చోటకి పంపించి ఆ ప్రాంతం లో మార్పులు చేస్తున్నారు. అందుకోసం 24 జూన్ న అక్కడ కొబ్బరికాయ కొట్టి హైదరాబాద్ వచ్చేసారు అధికారులు .

Two days back Chadrababu Naidu opened temporary secretariat. All employees from Hyderabad came to Amaravathi. But after opening of secretariat all employees returning to Hyderabad.