కార్యకర్తల రుణం తీర్చుకుంటా

8 Jul 2016


పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తల రుణం తీర్చుకుంటాననీ, నిత్యం వారికి అందుబాటులో ఉంటానని శాసనసభలో ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన కడప జిల్లా పులివెందులలోని తన కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నాయకులు, కార్యకర్తలతో పలు సమస్యలపై చర్చించారు. ప్రజాసమస్యల కోసం నాయకలు నిరంతరం పోరాడాలని పిలుపిచ్చారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని సూచించారు. గడప గడపకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కడప ఎంపి అవినాష్‌రెడ్డి, మాజీ డిసిసిబి ఛైర్మన్‌ తిరుపాల్‌ రెడ్డి పాల్గొన్నారు. 

జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం జెడ్‌పి చైర్మన్‌ గూడూరు రవితో పాటు జెడ్‌పిటిసిలు కలిశారు. జెడ్‌పిటిసిలకు వచ్చే నిధులను ప్రభుత్వం నిలిపేసిందని వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత తీవ్రంగా ఉందని, ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చించాలని వారు కోరారు. దీంతో స్పందించిన జగన్‌ అసెంబ్లీలో మాట్లాడుతానని జగన్‌ వారికి హామీ ఇచ్చారు.

YSRCP honorable Leader YS Jagan yesterday in his office in Kadapa district visited YSRCP leaders. He was commented about them, i will always with them.