ప్రశ్నించకపోతే ఇంకా మోసాలు చేస్తారు

8 Jul 2016


ఎన్నికల హామీలపై ప్రజలు ప్రశ్నించకపోతే భవిష్యత్తు ఉండదని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ చెప్పారు.పులివెందులలో ఆయన గడపగడప కు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బేషరతుగా రైతుల రుణమాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చేస్తానని అన్నారని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తే ప్రజలు నిలదీస్తారాన్న బావన కలగాలని, చంద్రబాబును ఈ విషయాలలో నిలదీయాలని జగన్ పిలుపు ఇచ్చారు. చంద్రబాబును నిలదీయకపోతే ఆయన మోసాలకు అంతు ఉండదని, ముందు రోజులలో ఇంటింటికి కారు కొనిస్తానని,విమానం కొనిస్తానని కూడా చెబుతాడని జగన్ అన్నారు.చంద్రబాబు పాలనకు మార్కులు వేయాలని కూడా కోరుతూ కరపత్రాలు ఇచ్చామని ఆయన అన్నారు. ఈ రెండున్నర ఏళ్లలో లక్ష నలభై ఏడువేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డాడని ఆయన చెప్పారు. తాము కోరిన విదంగా మార్కులు వేయాలని కోరితే చంద్రబాబుకు నూటికి సున్నా మార్కులు వస్తున్నాయని జగన్ చెప్పారు.రాజకీయ వ్యవస్థను మార్చాలంటే ప్రశ్నించాలని ఆయన అన్నారు.

AP opponent leader YS Jagan fired on Chandrababu Naidu and his government. Chandrababu formed government with fake promises, we have to question him.