అమరావతి ముసుగులో క్విడ్‌ ప్రోకో

6 Jul 2016


టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు మండిపడ్డారు. రాజధాని నిర్మాణం పేరుతో క్విడ్ ప్రోకో జరుగుతోందని చెప్పుకొచ్చారు. మంగళ వారం విజయవాడలో విక్రమ్ సోని రాసిన 'అమ రావతి సహజ నగరం' అనే పుస్త్తకాన్ని ఆయన ఆవి ష్కరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. విదేశీ కంపెనీలకు మేలు చేసేందుకు అభివృద్ధి పేరుతో స్కాం జరిగే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. రైతులు చేసే త్యాగాలు వృథాకాకుండా చూడాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని శోభనాద్రీశ్వర రావు చెప్పారు. రాజధానిలో జరుగుతున్న అవినీతిపై రైతులు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Ex-Minister Vadde Sobhanadreeswararao fired and Chandrababu Naidu and his government. Chandrababu Naidu is doing Quid pro quo in the name of Amaravathi.