బిజెపితో సర్దుకు పోవాలి

8 Jul 2016


ఆలయాల కూల్చివేత వ్యవహారంతో పాటు పలు అంశాల్లో బిజెపి నేతలు ప్రభుత్వ ప్రతిష్ట దిగజారేలా వ్యవహరిస్తున్నారని టిడిపి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఉండవల్లిలోని సిఎం నివాసంలో గురువారం జరిగిన టిడిపి సమీక్షా సమావేశంలో ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలతో పాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించారు. 

బిజెపి నేతల పోకడలతో పార్టీకి, ప్రభుత్వానికీ చెడ్డ పేరు వస్తోందని ముఖ్యమంత్రి దృష్టికి నాయకులు తీసుకెళ్లగా, ప్రస్తుత పరిస్థితుల్లో సర్దుకుపోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. గడప గడపకు వైసిపి కార్యక్రమంపై కూడా చర్చ సాగింది. ఈ పార్టీ శ్రేణుల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని సమీక్షలో ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విస్తృత ప్రచారం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పథకాల అమలు క్షేత్ర స్థాయిలో ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సిఎం సూచించారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

Yesterday AP Cabinet meeting was conducted in Vijayawada. In this meeting TDP ministers complaint about BJP MLA and leaders. They are doing all mater issues.