బాబు సర్వే పై మంత్రులు అసహనం..

8 Jul 2016ఎవరితో చేయించారో, ఎప్పుడు చేయించారో తెలియదు కానీ చంద్రబాబు గురువారం సడెన్ గా సర్వే రిపోర్టంటూ కాగితాలు బయటకు తీసేసరికి ఏపీ మంత్రులు - ముఖ్యనేతలకు ఒక్కసారిగా షాక్ తగిలిందట. చంద్రబాబు నిన్న మంత్రులు - పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఒక్కాసారిగా సర్వే రిపోర్టంటూ కాగితాలు బయటకు తీశారట. దీంతో మళ్లీ ఇదెప్పుడు చేశారీయన అంటూ నేతలంతా ఆశ్చర్యపోయారట. ఆ సర్వే ప్రకారం చంద్రబాబు పాలనపై ప్రజల్లో 80 శాతం మంది సంతృప్తిగా ఉన్నారట. ఎమ్మెల్యేల విషయం వచ్చేసరికి కేవలం 40 శాతం మంది విషయంలోనే ప్రజలు సేటిస్ఫైడ్ గా ఉన్నారట.

అయితే... సర్వేపై కొందరు సీనియర్ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో అంశాల వారీగా వెల్లడైన ఫలితాలపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు.. చంద్రబాబు రెండు నెలల కిందట నిర్వహించిన సమావేశంలో 80 శాతం ప్రజలు మనవైపు ఉండేలా చూడాలని చెప్పారట. ఇప్పుడు సర్వేలో అంతే శాతం అనుకూలంగా ఫలితం వచ్చింది. దీంతో చంద్రబాబు అనుకున్నది అనుకున్నట్లు జరిగిందా.. లేదంటే సర్వే చంద్రబాబు అనుకున్నట్లు వచ్చిందా అని డౌట్లు ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ విషయంలో సందేహాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ పథకాలన్నిటిలోనూ ఎన్టీఆర్ వైద్య సేవకు రెండో స్థానం దక్కింది. కానీ.. టీడీపీ మంత్రులు - ఎమ్మెల్యేలు - నేతల్లోనే చాలామందికి ఆ పథకం తెలియదని.. అలాంటప్పుడు ప్రజలు దానికి రెండో ప్లేసు ఎలా ఇస్తారని అంటున్నారు.  ఇలా చంద్రబాబు సర్వేలపై సీనియర్లు అనుమానపు చూపులు చూస్తున్నారు.

Yesterday in Cabinet meeting Baabu showed a survey report about TDP ruling and working of MLAs. According to this report 80% peoples are not satisfied with his government.