చంద్రబాబుకు సవాల్ చేసిన పార్ధసారధి..

1 Jul 2016


వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిపై టిడిపినేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి పార్థసారథి విమర్శించారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే అసత్యప్రచారాలకు దిగుతున్నారని ఆరోపించాు. ఎపిలో అవినీతి తారాస్థాయికి చేరిందని కేంద్రం వద్ద సర్వేలున్నట్లు ప్రచారం జరుగుతుందని, రాజధాని విషయంలో వస్తున్న ఆరోపణలపై సిబిఐ విచారణ ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. అంత సత్యశీలుడు చంద్రబాబు అయితే వైఎస్ మాదిరిగా ఆరోపణలపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు..టిడిపినేతలు వైసిపిపై విమర్శలు చేస్తూ అవినీతి బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని విమర్శించారు..ఇప్పటికే న్యాయస్థానాల్లో జగన్ పోరాడుతున్నారని, కోర్టులు న్యాయం వైపే ఉంటాయని వ్యాఖ్యానించారు.

YSRCP leader Pardha Sardhi fired on Chandrababu naidu and AP government. Chandrababu Naidu taking revenge on YS Jagan. He is harassing with fake charge sheets.