ఏపీలో చతికిల పడుతున్న చదువులు

7 Jul 2016


ఆంధ్రప్రదేశ్‌లో చదువులు చతికిల పడుతున్నాయి. ఇందుకు రాష్ట్రంలో నమోదవుతున్న అక్షరాస్యతా శాతమే నిదర్శనం. రాష్ట్ర విభజనకు ముందు వరకు రాష్ట్రంలో అక్షరాస్యతా శాతంలో పెరుగుదల ఉంది. విభజన తరువాత మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. గతంలో 72 వరకు అక్షరాస్యతా శాతాన్ని సమోదు చేసిన రాష్ట్రం ప్రస్తుతం 67 శాతానికి మించడంలేదు. 1991 జనాభా లెక్కల ప్రకారం ఏపిలో 44.09 శాతం అక్షరాస్యత ఉంది. ఆ తరువాత 2001లో ఏకంగా 61.11గా నమోదైంది. ఈ పదేళ్ల కాలంలో దాదాపు 17.02 శాతం వృద్ది రేటు ఉంది. 2011 వచ్చే సరికి కేవలం 67.66 శాతంగానే నమోదైంది. అంటే 2001 నుంచి 2011 వరకు ఉన్న పదేళ్ల కాలంలో కేవలం వృద్ది 6 శాతంగానే ఉంది. 2011 లెక్కల ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ స్థానం 31 గా ఉంది.ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు దిగువగా కేవలం నాలుగు రాష్ట్రాలు మాత్రమే ఉండటం విశేషం. 

గడచిన రెండేళ్లలోనూ రాష్ట్రంలో అక్షరాస్యత అనుకున్న స్థాయిలో వృద్ధి సాధించలేదు. లోటు బడ్జెట్‌లో కొనసాగుతుండటంతో ఎంతో ముఖ్యమైన విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలపై ప్రాధాన్యత తగ్గించుకుంటూ వస్తున్నారు. దీనికి తోడు కోట్లాది రూపాయలను కొత్త రాజధాని అమరావతికి, పెండింగ్‌ ప్రాజెక్టులకు మళిస్తున్నారనే విమర్శలు న్నాయి. ప్రభుత్వం హేతుబద్ధీకరణ పేరిట పాఠశా లలను మూసి వేసేందుకు సిద్దమవుతోంది. క్లస్టర్‌ విధానాన్ని ప్రవేశపెడుతూ రెండు లేక మూడు గ్రామా లకు కలిసి ఒకే పాఠశాలను ఏర్పాటు చేస్తూ మిగిలిన పాఠశాలలను మూసివేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 వేల పాఠశాలలు మూసివేతకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

In Andhrapradesh education percentage gradually decreasing. At the time both states combined AP literacy percentage is nearly 72%. From last two years it not exceeding 67%.