ఏపీకి బస్సులపై కేసీఆర్‌ కన్ను పడింది..

4 Jul 2016


ఇప్పటికే మా నీళ్లు, మా ఉద్యోగాలు అని లక్ష్మణ రేఖలు గీసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. తెలంగాణ ద్వారా ఏపీ ఒక్క పైసా కూడా లబ్ధి పొందకూడదని గట్టిగా నిర?యించుకున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ తాజాగా తీసుకుంటున్న నిర?యాలు ఏపీ ఎస్‌ ఆర్టీసీకి పెద్ద షాకింగ్‌గా మారనున్నాయి. నిత్యం ఏపీ నుంచి ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌కి వందల సంఖ్యలో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. దీనివల్ల ఏపీ ఆర్టీసీకి బాగా లబ్ధి చేకూరుతోంది. అయితే, ఈ మాత్రం ఎందుకు పోనివ్వాలని అనుకున్నారో ఏమో సీఎం కేసీఆర్‌.. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న టీఎస్‌ ఆర్టీసీని గట్టెక్కించేందుకు సరికొత్త ప్రతిపాదనను తెరమీదకి తెచ్చారు. 

ఏపీఎస్‌ ఆర్టీసీ సర్వీసులతో పోలిస్తే... తెలంగాణ నుంచి ఏపీకి తక్కువ సర్వీసులు నడుస్తున్నాయని తెలుసుకున్న కేసీఆర్‌... వాటి సంఖ్యను పెంచాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నెలలో 75 కొత్త సర్వీసులను ఏపీకి నడపాలని... వచ్చే నెలలో ఆ సర్వీసులను మరో 75కు పెంచాలని  కేసీఆర్‌ టీ ఆర్టీసీకి సూచించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రస్తుతం ఏపీఎస్‌ ఆర్టీసీకి వస్తున్న ఆదాయంలో ఖచ్చితంగా కోత పడుతుందని ఏపీ అధికారులు లెక్కలు కట్టారు. 

అయితే ఇరు రాష్ట్రాల ఆర్టీసీ మధ్య ఒప్పందం జరగకుండా తెలంగాణ ఏపీకి కొత్తగా సర్వీసులు నడపడం సాధ్యంకాదని  వాదిస్తున్నారు. ఇంకా టెక్నికల్‌ గా ఆర్టీసీ విభజన జరగలేదని గుర్తు చేస్తున్నారు. ఈ సమయంలో కేసీఆర్‌ ఇలాంటి నిర?యాలు తీసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి హైదరాబాద్‌ నుంచి ఏపీకి ఉన్న పలు లాభదాయకమైన రూట్లలో తెలంగాణ సర్వీసులు పెరిగితే... ఏపీ ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Telangana CM KCR on concentrated on APSRTC. Dialy number of APSRTC buses are running between Hyderabad and Vikayawada. KCR want to increase number TSRTC to between Hyderabad and Vijayawada.