ఎన్టీఆర్‌, బన్నీల పై పొగడ్తలు...!

2 Jul 2016తాజాగా సీనియర్ సహాయ నటి హేమ ఎన్టీఆర్, బన్నీలపై పొగడ్తల వర్షం కురిపించింది. బన్నీ ఎనర్జీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన రబ్బరు మనిషిలా డ్యాన్స్ చేస్తాడు. ఆయన్ని చూస్తే నాకు జెలసీగా ఉంటుంది. ఇక ఎన్టీఆర్ రోబో లాంటి వ్యక్తి. ఎన్ని పేజీల డైలాగులనైనా ఇట్టే స్కాన్ చేసి సింగిల్‌టేక్‌లో ఓకే చేయిస్తాడు... అంటూ హేమ వారిద్దరిపై పొగడ్తలు కురిపించింది.ఇక నాకు నాగార్జున అంటే కూడా చాలా ఇష్టం. వెయ్యిమందిలో ఉన్నా నన్ను గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరిస్తాడు. ఆయన బిజెనెస్‌మేన్ కావచ్చు... కానీ నిజజీవితంలో ఆయనలో కమర్షియాలిటీ కనిపించదు అని చెప్పుకొచ్చింది. ఇక బ్రహ్మానందంతో తనది మంచి జోడీ అంటోంది. 'అతడు' చిత్రంలోని కాఫీ కప్పు సీన్ అందరికీ గుర్తుండిపోయింది. బ్రహ్మానందం తన పాత్రను ఇంప్రవైజ్ చేస్తాడు. స్క్రిప్ట్‌లో ఉన్న డైలాగ్స్‌కు కొన్ని అదనంగా జోడిస్తాడు. దానికి దీటుగా నేను కూడా రిటార్ట్ ఇవ్వగలను. అందుకే మా జోడీ బాగా సక్సెస్ అయింది. ఇప్పటివరకు నేను400 చిత్రాల వరకు చేశాను. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్, లేడీ డాన్ వంటి పాత్రలు చేయాలని ఉంది. నిర్మలమ్మలాగా ఈ ఇండ్రస్టీలోనే వందేళ్లు జీవించాలని ఉంది. అవకాశాలు లేకపోతే అమ్మ, అమ్మమ్మ వంటి పాత్రలు చేస్తాను. అవీ లేకపోతే ఇక్కడే ఇంకో పని చూసుకుంటాను, అసిస్టెంట్ డైరెక్టర్‌గానో, ప్రొడ్యూసర్‌గానో మారుతాను తప్ప ఈ ఇండ్రస్టీ వదిలి ఎక్కడికి పోను.. అంటూ చెప్పుకొచ్చింది హేమ.

Tollywood senior character artiest Hema prides about Stylish Star Allu Arjun and Jr NTR. Allu Arjun is stylish and energetic.