ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకం పై షరతులు..

8 Jul 2016


మీకు బైక్‌ ఉందా? ల్యాండ్‌ ఫోన్‌.. ఫ్రిజ్‌ ఉన్నాయా? ఇంట్లో ఎవరైనా నెలకు రూ.10 వేలు వచ్చే ఉద్యోగమేదైనా చేస్తున్నారా? రెండు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారా? అయితే మీరు ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద సొంత ఇంటిని పొందేందుకు అనర్హులే. వచ్చిన అర్జీలు వడపోసి. అర్హులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం, ఇలా.. 13 షరతులను అమలు చేస్తోంది. ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో ఈ ఏడాది 2 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం సుమారు పది లక్షలకుపైగానే దరఖాస్తులందాయి. దీంతో అర్జీలను వడపోసేం దుకు ముందుగా ఆరు షరతులు పెట్టారు. 

ఇప్పుడు వాటిని 13కు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లగా ఇళ్లు ఇస్తామంటూ ఊరిస్తూ ఇప్పుడు ప్రభుత్వం లేనిపోని నిబంధనలన్నీ పెట్టిందని అర్జీదారులు ఆందోళన చెందుతున్నారు. చివరకు రూ.50 నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం సుమారు పది లక్షలకుపైగానే దరఖాస్తులందాయి. దీంతో అర్జీలను వడపోసేందుకు ముందుగా ఆరు షరతులు పెట్టారు. ఇప్పుడు వాటిని 13కు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లగా ఇళ్లు ఇస్తామంటూ ఊరిస్తూ ఇప్పుడు ప్రభుత్వం లేనిపోని నిబంధనలన్నీ పెట్టిందని అర్జీదారులు ఆందోళన చెందుతున్నారు. చివరకు రూ.50 వేలకంటే ఎక్కువ విలువన్న కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఉన్నా ఇల్లు మంజూరుకు వీల్లేదని నిబంధన పెట్టారు. కౌలు రైతులకు చేసిందేమీ లేకపోగా, రెండు ఎకరాలు దాటి కౌలుచేసే రైతూ ఇంటికి అనర్హుడుగా నిబంధన పెట్టడం శోచనీయమని పలువురు విమర్శిస్తున్నారు. 

స్మార్ట్‌ సర్వేలో వడపోతా భాగమే?
రెండు రోజుల క్రితం విజయవాడలో హౌసింగ్‌ పిడిల సమావేశంలో ఈ నిబంధనల అమలుపై చర్చ సాగిందని తెలిసింది. వీటిని పక్కాగా అమలు చేయాలని, అందుకు శుక్ర వారం నుంచి చేపట్టే స్మార్ట్‌ పల్స్‌ సర్వేను ఉపయోగించు కోవాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని అధికారులకు సూచించారు. ఏడాది క్రితమే ప్రకటించిన ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద ఇంతవరకు ఒక్కఇల్లు కూడా కట్టకపోవడమే కాక, పదేపదే లబ్ధిదారుల కుదింపునకే చర్యలు తీసుకుంటుండంతో అసలీ పథకం అమలు అవుతుందా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్‌ ఇళ్లకు 13 షరతులు

షరతులు ఇవే
- రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు.
- ట్రాక్టర్‌, ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలు ఉండకూడదు
- రూ.50 వేలు లేదా అంతకంటే ఎక్కువ విలువ ఉన్న కిసాన్‌ క్రెడిట్‌ పత్రాలు కలిగి ఉండకూడదు
- ప్రభుత్వ ఉద్యోగై ఉండకూడదు.
- వ్యవసాయానుబంధ యంత్రాలు, పనిముట్లు కలిగి ఉండకూడదు.
- కుటుంబంలో నెలకు రూ.10 వేలు సంపాదించే వ్యక్తులు ఉండకూడదు.
- వృత్తి పన్ను చెల్లిస్తున్న వారు అర్హులు కాదు
- ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ ఉండకూడదు
- ఇంట్లో ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ఉండకూడదు
- రెండు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమిని కౌలు చేస్తూ ఉండకూడదు
- 7.5 ఎకరాల మెట్ట భూమిగల వారూ అనర్హులే 
- ఫ్రిజ్‌, ల్యాండ్‌ ఫోనూ.. అనర్హతలే..! 
- పదివేల జీతం దాటితే కుదరదు 
- రెండెకరాలు కౌలు చేసినా కష్టమే

Chandrababu Naidu introduced NTR Housing scheme. But now AP Government introduced 13 conditions on this scheme.