నోరు జారిన చంద్రబాబు..!

4 Jul 2016


2018లో అమరావతిలో ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొరపాటున నోరుజారారు. విశాఖ సాగర తీరంలో నైట్ బే మారథాన్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో అమరావతిలో ఆసియా గేమ్స్ జరగనున్నాయని అన్నారు. రెండేళ్లలలో ఒలింపిక్స్ జరుగబోతున్నాయని అనడంతో అధికారులు విస్తుపోయారు.

ఆపై నవ్యాంధ్ర రాజధానిలో అమరావతిలో ప్రతిష్ఠాత్మక పోటీలను నిర్వహించేందుకు కృషి చేస్తామని తన పొరపాటును సవరించుకున్నారు. కాగా, నాలుగేళ్లకు ఓసారి జరిగే ఒలింపిక్స్ పోటీలు ఆగస్టు 5 నుంచి బ్రెజిల్ లో జరగనుండగా.. 2020లో టోక్యోలో, ఆపై 2024లో రోమ్ లో నిర్వహించనున్నారు.

Chandrababu Naidu participated in Vizag marathon. The this marathon he announced in 2018 Olampic games will conduct in Amaravathi, incited of announcing National games.