రంజాన్ ‘తోఫా’ పేరుతో దోపిడీ

4 Jul 2016


కాదేదీ అవినీతిక‌న‌ర్హం అన్న చందంగా త‌యార‌య్యింది ఏపీలో ప‌రిస్థితి. గ‌త ఏడాది తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈసారి కూడా తోఫా పేరుతో మైనార్టీల‌కు మ‌రోసారి ద‌గా జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. నాసిర‌కం స‌రుకులు అంట‌గ‌డుతూ ప్ర‌భుత్వం పండ‌గ చేసుకోమ‌న‌డంపై చాలా మంది అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ఏడాది కూడా ఇదే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అప్ప‌ట్లో స‌ర్కారు లోపాలు స‌రిదిద్దుతామ‌ని చెప్ఇపంది. కానీ మ‌ళ్లీ అదే తీరులో సాగుతూ చంద్రన్న తోఫా’ పేరిట నాలుగు నిత్యావసర సరుకులతో కూడిన కానుక ప్యాక్ లో ప‌రుగులు కూడా క‌నిపిస్తున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మందికి రంజాన్‌ తోఫా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోంది. దీనికోసం రూ. 53 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. జూలై ఒకటి నుంచి తోఫాను అందించాల్సి ఉంది. అయితే ఆది వారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా కనీసం 20శాతం మందికి కూడా సరకులు అందించలేదు. రంజాన్‌ ఇంకా మూడు రోజులే మిగిలి ఉండగా మిగిలిన దాదాపు 80 శాతం ప్రజలకు ఎప్పుడు అందజేస్తారో అంతుపట్టడం లేదు. 

మొదటిలో ప్రభుత్వం తక్కువ వ్యవధిలోనే తోఫాను అందించాలని సూచించింది. అయితే క్షేత్రస్థాయిలో ఆ రకంగా జరగడం లేదు. ఒక్కొ ముస్లీం కుటుంబానికి ఐదు కేజీల గోధుమ పిండి, రెండు కేజీల పంచదార, కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి చొప్పున ఒక సంచిలో వేసి అందించాలి. కొన్ని జిల్లాల్లో అయితే లబ్దిదారుల పేర్లు ఆన్‌లైన్‌లో లేకపోవడంతో సరుకులు పొందే అవకాశం లేకుండా పోయింది. దీంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అందిస్తున్న స‌రుకుల్లో కూడా నాణ్య‌త మ‌రీ దారుణంగా ఉండ‌డంతో చాలామంది పెద‌వి విరుస్తున్నారు. పండుగ పూట ప్ర‌భుత్వం ఇలాంటి పుచ్చుపోయిన స‌రుకుల‌తో త‌మ‌ను అవ‌మానించేలా ఉంద‌ని కొంద‌రు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నిస్తే వాస్త‌వ ప‌రిస్థితి అర్థ‌మ‌వుతోంది. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ప‌రిటాల సునీత‌కు సంబంధించిన కొంద‌రు వ్య‌క్తులే కాంట్రాక్ట్ వ్య‌వ‌హారాలు చూస్తున్న‌ట్టు స‌మ‌చాఆరం. దాంతో ఎలాంటి నాణ్య‌త లేక‌పోయినా ప‌ట్టించుకునే పాపాన పోవడం లేద‌ని చెబుతున్నారు.

AP Government announced ranjan tohfa for poor Muslim people. For this it spend 53 crores. But they are supplying cheep quality items.