ఉఠ్ రే పంజాబ్-హీరో సూర్య ప్రమోషన్

18 Jun 2016


ఉడ్తా పంజాబ్ సినిమాకి మీడియా కావాల్సినంత పబ్లిసిటీ ఫ్రీగా ఇచ్చేసింది. ఇందులో పెద్ద హస్తాల చేతికి ముడుపులు ముట్టాయేమో తెలీదు కానీ, ఇప్పుడు పైరసీ సినిమా చూడొద్దంటూ వీళ్లంతా చేస్తున్న ప్రచారం మాత్రం వళ్లు మండించకతప్పదు. సినిమాని ఆన్ లైన్లో పెట్టడంతో చాలామంది దీన్ని డౌన్ లోడ్ చేస్కున్నారు. పుదుచ్చేరిలో శక్తి అనే కేబుల్ ఛానల్ లైవ్ లో సినిమా చూపించేసిందట. దీంతో అక్కడి హీరో సూర్య తన అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో దీనికి వ్యతిరేకంగా పోస్ట్ చేశాడు. పైరసీని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటూ ట్వీట్ చేశాడతగాడు. ఐతే మరి దీన్ని ఆయన రీమేక్ చేస్తాడో, లేక నిజంగానే పైరసీ వద్దంటున్నాడో కానీ మరి సినిమాల దగ్గర భారీగా అమ్మే బ్లాక్ టిక్కెట్ల గురించి మాత్రం ఎందుకు పట్టించుకోరు..?

ఏ హీరో మూవీ రిలీజ్ అయినా, ఓ బ్యాచ్ లా ఫామ్ అయి థియేటర్ కౌంటర్లలో టిక్కెట్లు ఒకటో పదో ఇచ్చేసి, మిగిలినవన్నీ మీ అభిమానం అనే పేరుతో వందలకి వందలకి అమ్మేస్తుంటారు. అలా జనాన్ని దోచుకుంటున్నప్పుడు లేని బాధ ఇలా పైరసీ చూస్తే ఎందుకు బాధ కలుగుతుందో తెలీదు. నిజంగా నీ సినిమాలో దమ్ముంటే పైరసీ ఐయినా సరే కలెక్షన్లకి ఏ మాత్రం దెబ్బ ఉండదు. ఇంకా దమ్ముంటే బాలీవుడ్ లో ఎటూ డీవీడీలు సినిమాతో పాటే రిలీజ్ చేయడం సహజమే కదా. అలా ఒరిజినల్ డీవీడీలు విడుదల చేస్తే ఏ బాధ ఉండదు కదా.

Bollywood Movie Udta Punjab got more popularity with sensor report. Now it got Clarence forrm sensor board. Now biggest problem its movie print was already in Internet.