బగ్దాదీ చచ్చాడా

15 Jun 2016


ఉగ్రవాదంపై పోరులో అమెరికా నేతృత్వంలోని కూటమి భారీ విజయం సాధించిందా? సోమవారం మీడియా ద్వారా అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ చీఫ్ అబు బక్ర్ అల్ బగ్దాదీ సిరియాలో వైమానిక దాడుల్లో మరణించినట్లు తెలుస్తోంది. ఐసిస్ చీఫ్ అల్ బగ్దాదీ ఖతమైనట్లు ఇరాన్ మీడియా ప్రచారం చేస్తోంది. ఇదే నిజమైతే ఉగ్రవాదంపై పోరులో  పెద్ద విజయమే  సాధించిందని చెప్పాలి.  ఉత్తర సిరియాలోని రక్కాలో జరిగిన వైమానిక దాడిలో బగ్దాదీ మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వం చెప్తోంది. అక్కడి  టర్కిష్ దినపత్రిక యెనిస్ సఫక్  గత ఆదివారం జరిగిన దాడిలో ఆల్ బగ్దాదీ ఖతమయ్యాడని అంటోంది..  మోసుల్ నగరం నుంచి 65 కి.మీ. దూరంలో జరిగినట్లు ఈ వైమానిక దాడిలో  ఆ ఛానల్ పేర్కొంది.  

ఐతే ఇప్పటిదాకా అమెరికా మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అబూబకర్ అల్ బాగ్దాదీ.. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా అధినేత. ఈ ఉగ్రవాద సంస్థను స్థాపించి, ప్రపంచం నలుమూలలా ఉగ్రవాద దాడులతో అల్లకల్లోలం సృష్టిస్తున్న వ్యక్తి. అలాంటి కరడుగట్టిన ఉగ్రవాది ఖతమయ్యాడంటే అమెరికా నిశ్సబ్దంగా ఉండిపోలేదు..ఐతే ఇరాన్ చేస్తున్న ప్రచారాన్ని కనీసం ఖండించకపోవడం కూడా మరోవైపు అయోమయం కలిగిస్తోంది.. బగ్దాదీ తలకు 25 మిలియన్ అమెరికన్ డాలర్ల రివార్డు ఉంది

Terrorist Chief Abu Bakra Bhaddadi is terror to America. But recently in attach of Iran government he was died.