జంప్ జిలానీలతో టిడిపి లో ఆధిపత్య పోరు..

29 Jun 2016


ఆపరేషన్ ఆకర్ష్‌తో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అలజడికి గురిచేసిన అధికార టిడిపిలోనూ ఈ వలసల వల్ల అంతర్గత పోరు తీవ్రమవుతోందన్న వాదనలు ఆ పార్టీలోనే వినవిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ఏకైక లక్ష్యంగా సాగిన ఈ వలసలు తమ పార్టీకి కూడా మున్ముందు పెద్ద సవాల్‌గా మారే ప్రమాదాలు కనిపిస్తున్నాయని టిడిపి నేతలు కొందరు వ్యాఖ్యనిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసవచ్చిన ఎమ్మెల్యేలకు టిడిపిలో ఒకప్పుడు తనకు ప్రత్యర్థిగా ఉన్న నేతలతో తీవ్ర వైరమున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఇరు ప్రత్యర్థులు ఒకే వేదికను పంచుకోవడంతో ప్రస్తుతం టిడిపిలో అంతర్గత పోరు, ఆధిపత్యపోరుకు బీజం పడుతోందని తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు వాపోతున్నారు. 

ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతున్న ఎమ్మెల్యేల వలసలతో టిడిపి ఎంతగా బలపడినా పార్టీలో పెరిగే ఆధిపత్యపోరుపై పార్టీ అధినాయకత్వం దృష్టిసారించకపోతే మున్ముందు అవే ప్రమాదఘటికలుగా మారే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు వైసిపి నుంచి తమ పార్టీలోకి కొనసాగిన ఎమ్మెల్యేల వలసల వల్ల ప్రతి జిల్లాలలో ఒకటి, రెండు చోట్ల మినహా పాత, కొత్త వారి మధ్య ఆధిపత్యపోరుకు బీజం వేస్తోందని టిడిపి ముఖ్యనేతలు సైతం అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. ఈ పోరుపై పార్టీ అధినేత దృష్టిసారించి వాటిని నియంత్రిస్తే తప్పా పార్టీ బాగుపడుతుందని లేకపోతే ఈ వలసలు అసలుకే ఎసరుతెచ్చే ప్రమాదంలేకపోలేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.

Chandrababu Naidu buying YSRCP MLAs with bumper offers. Now its became head ache to him. A silent war is running in TDP between TDP and YSRCP MLAs for leadership.