కేసీఆర్ సర్కార్ ఆర్టీసీ బాదుడు

24 Jun 2016


ముందుగా చెప్పినట్లే తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెరిగాయి. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు కొద్ది రోజుల క్రితం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్… ఆర్టీసీ చార్జీలు పెంచాలనే నిర్ణయానికి వచ్చారు. నష్టాల్లోంచి ఆర్టీసీని బయటపడేసేందుకే ఇదే సరైన మార్గమని భావించిన టీఆర్ఎస్ సర్కారు ఛార్జీలను పెంచేసింది.

పెరిగిన చార్జీలు వివరాలు చూస్తే.. పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీల లోపు ఒక్క రూపాయి మేర పెంచి… 30 కి.మీల పైన రూ.2 పెంపు నిర్ణయం తీసుకున్నారు. డీలక్స్, ఏసీ బస్సుల్లో పది శాతం చార్జీలు పెంచారు. సిటీ సర్వీసులపైనా పది శాతం చార్జీలు పెంపు అమలు కాబోతోంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది సర్కార్.

Telangana Government hiked RTC charges. To recover from debuts TRS government hiked charges. It is burden of 250 crores on common people.