తెలుగు రాష్ట్రాలను లూటీ చేస్తున్న ఇద్దరు సిఎంలు!

20 Jun 2016


 రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్దిలో తిరోగమిస్తున్నాయని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంఛార్జీ దిగ్విజయ్‌సింగ్ ఆరోపిం చారు. ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రులిద్దరు తమ స్వలాభాల కోసమే పనిచేస్తు న్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు సిఎం కెసిఆర్, చంద్ర ాబుతో చేతులు కలిపారని ఆయన ఆరోపించారు. ఆచరణ సాద్యం కానీ హమీలతో ఇద్దరు గద్దెనెక్కారని ఆయన మండిపడ్డారు. రైతు రుణమాఫీ చేయలేక చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కుటుంబపాలన కొనసాగుతుందని ఆయన ఎద్దేవా చేశారు. కెసిఆర్ కుటుంబ సభ్యుల చేతిలో తెలంగాణ బందీ అయిందన్నారు.కెజిటుపిజి ఉచిత విద్య, దళితులకు మూడెకరాల భూమి వంటి పథకాలు అటకెక్కాయన్నారు. కాంగ్రెస్ పార్టీ మహ సముద్రం వంటిదని, పార్టీ నుండి బయటకు వెళ్లేవారు నిస్సంకోచంగా వెళ్లవచ్చన్నారు. వారి స్థానంలో యువ నాయకత్వాన్ని తయారుచేసుకుంటామన్నారు. 

దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన నేతలు మాత్రమే వలస వెళుతున్నారన్నారు. వారి ఆర్థిక అవసరాలు, కాంట్రాక్టులు,వ్యాపార ప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నారన్న డిగ్గీరాజా పార్టీ మారడం పై వారి నైతికతకే వదిలివేస్తున్నామన్నారు. మల్లన్న సాగర్ ముంపు బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమన్నారు. పాలకులు ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ ప్రజలు సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోలుకుంటుందన్న ఆయన ఢిల్లీ, బిహర్ ఎన్నికలలో బిజెపి ఓటమి పాలైందని గుర్తు చేశారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాదిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Telangana Congress in charge Digwijay Singh visited Adhilabad district. In press meet he was fired about both telugu state CMs. Both CMs are spoiling the states.