గత ఎన్నికలలో 11.50 కోట్లు ఖర్చు చేశా!

22 Jun 2016


గత ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు చేశానని గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యుడు, ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచ లనం సృష్టించాయి. వీటిపై అటు రాజకీయవర్గాలలోనూ, న్యాయవర్గాలలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. కోడెల ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘నేను మొదట రాజకీయాల్లోకి వచ్చి 1983 ఎన్నికల్లో పోటీ చేసినపుడు రూ. 30 వేలు ఖర్చయ్యింది. ఆ 30 వేలల్లో కూడా గ్రామాలు, ప్రజల నుంచి చందాలు వచ్చాయి.  

అలాంటిది మొన్నటి ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చయ్యింది. ఈ విధంగా డబ్బు ఖర్చు చేయాలంటే అవినీతి చేసే వారు కొంత మంది, ఆస్తులు అమ్మేవారు కొంత మంది, రెండూ కలిపి చేసేవారు కొంతమంది ఉన్నారు. పార్లమెంటు సభ్యుడి దగ్గర తీసుకునే వారు కూడా కొంతమంది ఉన్నారు. రాజకీయాల్లో డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. ఇది ఆరోగ్యకర పరిణామం కాదు. ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజాప్రతినిధులు సంపాదిం చారు కాబట్టి వారి దగ్గర డబ్బులు తీసుకోవటం సరైందేనని ప్రజలు అనుకుంటున్నారు. మా దగ్గర ప్రజలు డబ్బులు తీసుకున్నారు కా బట్టి సంపాదించుకోవాలని వారు (ప్రజాప్రతినిధులు) అనుకుంటున్నారు‘ అని అన్నారు.

AP speaker Kodela Siva Prasadrao comments are now sensational. He told i was spent 11.50 crores for last elections. It was a crime according to Election commission.