ఎమ్మెల్యేల కొనుగోళ్లకు మీడియా వత్తాసా!

6 Jun 2016


ఎపి ముఖ్యమంత్రి ,తెలుగుదేశం అదినేత చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలను ఎదుర్కుని నిలబబడడానికి విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ తన ఎమ్మెల్యేలను వేర్వేరు చోట్లకు విహార యాత్రలకు పంపించవలసి వచ్చిందని ఒక పత్రికలో కధనం వచ్చింది.

ఇది నిజంగా చిత్రమైన అంశమే. ఒకప్పుడు ఎన్.టి.రామారావును కాంగ్రెస్ పార్టీ అదికారం నుంచి దించినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలతో ఆ పార్టీ నాయకత్వం కర్నాటకలో శిబిరాన్ని నిర్వహించింది. ఆ రోజులలో కాంగ్రెస పార్టీ,టిడిపి నుంచి చీలిన నాదెండ్ల భాస్కరరావులు ఎమ్మెల్యేలను కొంటున్నారని టిడిపి ఆరోపించిదే.సరిగ్గా ఇప్పుడు అవే విమర్శలను తెలుగుదేశం పార్టీ ఎదుర్కుంటోంది. ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొంటున్నారని,చివరికి ఒక రాజ్యసభ సీటుకోసం ఎంత నీచానికైనా టిడిపి పాల్పడుతోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన డబ్బున్న ఒక కాంట్రాక్టర్ ను డబ్బుతో రంగంలో దించడానికి టిడిపి ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది.ఈ వార్తలు వస్తుండడంతో జగన్ ముందు జాగ్రత్తగా సుమారు నలభై మంది ఎమ్మెల్యేలను టిడిపి ప్రలోభాలు, ఇతరత్రా ఇబ్బందులకు గురి చేయకుండా వేరే చోట్లకు పంపించారని ఆ కధనం చెబుతోంది.జగన్ ఇలా శిబిర రాజకీయాలకు పాల్పడతారా అని ఆ కధనంలో విమర్శించారు.ఎమ్మెల్యేలు సెల్ పోన్ లను కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారని ఆ కధనంలో తెలిపారు.

ఏది ఏమైనా నైతిక విలువల కోసం పుట్టామని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఇలాంటి దౌర్బాగ్యపు రాజకీయాలకు దిగుతుంటే ,మీడియాలోని ఒక వర్గం ఫిరాయింపు రాజకీయాలను విమర్శించవలసింది పోయి,వైసిపి ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండాపోయారని బాదపడుతూ రాయడం దిగజారుతున్న ప్రమాణాలకు అద్దం పడుతున్నట్లే బావించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

తెలంగాణలో టిడిపితో సహా ఆయా పార్టీల ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ ఆకర్షించినప్పుడు తీవ్రంగా విమర్శించిన ఒక వర్గం మీడియా ఇప్పుడు ఎపిలో జరుగుతున్నవాటిని సమర్ధిస్తూ రాస్తోందని వారు అంటున్నారు. నిజమే తెలంగాణలో అయినా,ఎపిలో అయినా ఇలాంటి పిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించడం అంటే నైతికంగా దిగజారడమే అవుతుంది.

Some media channels are supporting Chandrababu Naidu and his worst ruling. It supporting MLAs buying.