ఆశ్చర్యపోయిన జగన్

3 Jun 2016


వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి బాలేదని అనేవాళ్లకి కూడా ఓ షాక్. అనంతపురం జిల్లాలో రైతు భరోసాయాత్రలో వస్తున్న స్పందన చూసి సాక్షాత్తూ జగనే ఆశ్చర్యపోతున్నారు. తాను సభల్లో కేవలం నిమిత్తమాత్రుడిగానే నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే మైకందుకున్న రైతులే చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు, తాను మాత్రం కేవలం రైతు పేరు ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత లోన్ ఉంది. ఈ నాలుగు అడిగితే చాలు, మిగతా పని వాళ్లే చేసుకుపోతున్నారు. రుణమాఫీ సహా ఎన్ని అంశాల్లో తాము ఎలా మోసపోయామో పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. ఇది చూసిన జగన్, తన యాత్ర సక్సెస్ అయినట్లు ముందే నిర్ధారణకు వచ్చేసారు. ఇప్పుడు ఇది ఎక్కడ జిల్లా అంతటా పాకుతుందనే, జేసీ బ్రదర్స్ ఇష్టంవచ్చినట్లు పేలుతున్నారు. ఐతే వీళ్లెంత బలంగా అడ్డుకుంటే అంత పాపులర్ అవుతాడు జగన్.

వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గతంలోనూ ఇలానే ఆపాలని చూశారు. ఐతే ప్రతిసారీ తన జనబలమెంతో నిరూపించుకుంటూ పెంచుకుంటూ పోతున్నాడాయన. జనంలోని వ్యతిరేకతను దగ్గర్నుంచి చూశాడు కాబట్టే, చంద్రబాబుపై జగన్ ఆ రేంజ్ లో విరుచుకపడ్డాడు. దానికి టిడిపి మంత్రులు అనవసరంగా  చించుకోవాల్సిన అవసరం ఏం లేదు. చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఆడలేక మద్దెల ఓడులా నిలదీసేవాళ్లపై ఎందుకు ఏడ్పులు..

YS Jagan was got shocked in Ananthapuram district tour. Farmers are coming to YS Jagan to solve their Problems who were cheated by YS Jagan.