జగన్ చెప్పిన రహస్యం

14 Jun 2016


వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గడపగడపకు కార్యక్రమం చేపడుతుందని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ అన్నారు. రాజకీయాలలో గెలవాలనుకుంటే ఒక రహస్యం చెబుతానని అన్నారు. రాజకీయాలలో గెలవాలంటే తాతగారో, నాన్నగారో రాజకీయాలలో ఉండనక్కర్లేదని, ప్రతి గడపకు వెళ్లడమే మార్గమని అన్నారు. తాము ఒక కరపత్రం తయారు చేశామని, అందులో చంద్రబాబు ఇచ్చిన హామీలు పెట్టామని, వ్యవస్థ మారాలన్న తన మాటలు అందులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఇందులో వంద ప్రశ్నలు వేసి చంద్రబాబుకు మార్కులు వేయాలని కోరుతున్నామని అన్నారు. ఎమ్మెల్యే కావాలనుకున్న వారు ఈ కరపత్రాలు ప్రతి ఇంటికి తీసుకు వెళ్లి ప్రజలతో మార్కులు వేయించాలని, వారు సున్నా మార్కులు వేస్తే మీరు ఎమ్మెల్యే అయినట్లేనని జగన్ ఆ రహస్యాన్ని వివరించారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పరామర్శించాలని, రెండు, మూడు నిమిషాలు కోఆర్డి నేటర్ గపడాలని అన్నారు. ప్రజలలో నిరంతరం ఉంటూ విజయం సాధించాలని జగన్ ఉద్బోదించారు.

YS Jagan started "Gadapa Gadapaku YSR Party". He told about politics, to become a politician no back ground support is necessary. It is enough to go every house to know about their problems.