కోటి మొక్కలు ఎప్పడు నాటుతారు కెసిఆర్

5 Jun 2016


లక్ష్యం భారీ గా ఉంటె సరిపోదు, మరి ఆచరణ కూడా ఆ స్తాయిలో లేకపోయినా సంకల్పం ఉండాలి కదా. హరిత హారం పేరుతో తెగ మొక్కలు నాటేస్తామని  తెగ పంచేస్తామని కబుర్లు చెప్పి రెండేళ్ళు దాటుతోంది. రోడ్ లో డివైడర్ పెట్టి నాటేసి ఆ ప్రాజెక్ట్స్ లో టెండర్స్ పిలవడానికే సరిపోతే ఎలా ?

మరి ఈ రెండేళ్లలో ఎన్ని మొక్కలు పంపిణి చేసారు? ఎన్ని నాటారు? ప్రస్తుతం వాటి స్తితి ఎలా ఉంది? ఇలాంటి ఆడిటింగ్ లేకపోతే ఇదంతా ఉత్తిత్తి కార్యక్రమం అవదా ? అందులో పర్యావరణ దినం అని ఒకటి ఇవాళ ఉంది. మరి అంతకన్నా మంచి సందర్భం ఇంకోటి ఉండదు కదా .

ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయ్,  ఈ టైం లో పంచితేనే జనం కాస్త శ్రద్ద చూపిస్తారు .లేదంటేవాడటానికి లేని నీళ్ళని మొక్కలకి ఎలా పోస్తారు? ఇప్పుడే అయితే ఓ నెల రోజులైనా వాటికీ నీళ్ళు  అందుతాయ్, చక్కగా బతుకుతాయ్ ప్రోగ్రాం టార్గెట్ రీచ్ అవుతుంది లేదంటే మూలపడుతుంది .

KCR telling we will plant one crore plants. But till now he is not plant at least one, at least he is not calling tenders for this.