చచ్చినా నటిస్తున్న విష్ణువర్ధన్

3 Jun 2016


విష్ణువర్ధన్ కన్నడనటుడైనా, తెలుగులో కూడా ఆయనకి గుర్తింపు ఉంది. డబ్బింగ్ సినిమాలతో బాగా పరిచయం. యమకింకరుడు అనే చిరంజీవి సినిమా, కన్నడంలో ఆయనే చేశాడు. శోభన్ బాబు బలిదానం కూడా అదే సబ్జెక్ట్ తో తీసిందే. 200 సినిమాలు ఏకధాటిగా హీరోగా నటించిన విష్ణువర్ధన్ నాగవల్లి తో ఓ ఊపు ఊపాడు. 2009 లో చనిపోయిన ఈ హీరోని ఇంకా అక్కడి జనం మర్చిపోలేదు. దీంతో ఓ కొత్త ఫీట్ తో మన డైరక్టర్ కోడి రామకృష్ణ ఆయన్ని రీ క్రియేట్ చేశాడు.

నాగరహవు పేరుతో ఓ సినిమా తీస్తున్నాడాయన, అందులో చనిపోయిన విష్ణువర్ధన్ నటించడమే విశేషం. అంటే ఏదో పాత విజువల్స్ తీసి పోస్ట్ చేయడం కాకుండా, కొత్త సీన్స్ తోనే విష్ణువర్ధన్ కన్పించడం అంటే ఇదంతా గ్రాఫిక్స్ తో కుదిరింది. ఐతే ఇది మొదటి సారేం కాదు, ఎంజిఆర్ తో ఇలానే ఓ సినిమా తీసారు. ఇక తెలుగులో ఎన్టీఆర్ విజువల్స్ తో యమదొంగ, కలిసుందాం రా లో కొన్ని సీన్స్ ఇరికించడం గుర్తుండే ఉంటుంది. అలా అప్పటి నటులను తిరిగి చూసుకోవాలనే కోరికను తీర్చుకున్నారు.

ఐతే ఇప్పుడు సినిమాలో ఫుల్ ప్లెడ్జెడ్ గా గ్రాఫిక్స్ లో ఆయన్ని కన్పించేలా చేయడమే ఆసక్తి కలిగిస్తోంది. ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే, ఇక తిరిగి ఎన్టీఆర్, ఎంజీఆర్, కాంతారావ్, ఎస్వీ రంగారావ్, సావిత్రి, భానుమతి లాంటి నటులతో కొత్త సినిమాలు తీయొచ్చు. ఇప్పుడు నాగరాహవు కి గ్రాఫిక్స్ చేసింది రాజమౌళికి చెందిన మకుట గ్రాఫిక్స్ కంపెనీనే కావడం మరో విశేషం. రెండేళ్లపాటు కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించారట. ఆ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో పండగ చేస్తోంది.

Kanada hero Vishnu Vardhanarao is very familiar telugu people. He did so many telugu movies remake in Kanada. He got more popularity wity Nagavalli. He was died in 2009. But Kodi Ramakrishna is doing a movie with him. By using graphics he is doing this.