మమ్మల్ని కొట్టొద్దంటూ స్టార్ హీరోకి విజ్ఞప్తి

15 Jun 2016


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవాడానికి గల కారణాల పై డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరా తీయడం ప్రారంభించారు. ఇందుకోసం ఒక్కో రోజు ఒక్కో జిల్లా నేతలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో పార్టీ ఓటమికి గల కారణాల కంటే, ఆయన వైఖరి, ప్రవర్తన, చేయి దురుసుతనం గురించే నేతలు ఎక్కువగా ఫిర్యాదు చేస్తున్నారు. అసలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఎవరూ కారణం కాదు, మీరే కారణమంటూ డిఎండికే కార్యకర్తలు, నేతలు విజయ్ కాంత్ కి తేల్చి చెప్పారు. ఎక్కడబడితే అక్కడ, ఎలాబడితే అలా చేయి చేసుకోవడం, అది మీడియాలో హైలెట్ అవడంతో పరువు  పోయిందని నేతలు ఏకరువు పెట్టారు. 

ఓటమి పోస్ట్ మార్ట్ మ్ చేస్తున్న విజయ్ కాంత్ కి దీంతో షాక్ తగిలింది, ఖచ్చితంగా మళ్లీ నోరు మడతేయబోయి ఉంటారు కానీ, కంట్రోల్ చేసుకుని ఉంటారు. ఏ మాత్రం ఓటు బ్యాంక్‌ లేని నాలుగు పార్టీల ప్రజాసంక్షేమ కూటమితో పొత్తు తో డిఎండికే నష్టపోయిందని నేతల వాదన, అందుకే  పార్టీ ప్రతిష్ట అధఃపాతాళానికి పడిపోయిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా ఒంటరిగా పోటీచేస్తే మంచిదని సూచించారు. దీంతో కెప్టెన్ దీర్ఘాలోచనలో పడిపోయాడట, మళ్లీ సినిమాలు చేద్దామా, లేక స్టేట్ అంతా చుట్టేసి తన సత్తా పెంచుకునే ప్రయత్నం చేద్దామా అని మధనపడుతున్నాడట కెప్టెన్.

In Tamilnadu election 2016 Vijaykanth got big shock. his party did not get even a single seat. Now he is post murdering reasons for his disaster.