అనుభవించు రాజా..!

2 Jun 2016


ఇండియాలో బ్యాంకులకు 9వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా కాస్తైనా ఆందోళన కానీ, బెరుకుగానీ లేకుండా తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు తనపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయినా లెక్కే లేనట్లు వ్యవహరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. కొడుకు సిధ్దార్ధ మాల్యాతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ కామెంట్లపై కామెంట్లు పాస్ చేశారు. ఇది చూస్తే విజయ్ మాల్యా మోసగాడు కాకపోతే, మంచోడని ఎవరైనా అనగలరా..?

యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ లో విజయ్ మాల్యా చైర్మన్ గా రిజైన్ చేశాడంటున్నారు. కానీ అది నిజం కాదు, ఇప్పటికీ వీడియో కాన్ఫెరెన్స్ లలో మీటింగులు పెడుతున్నాడు. అలానే తాను ఎలా ఎంజాయ్ చేస్తున్నదీ జనానికి గుచ్చుకునేలా వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు, ఇది ఓరకంగా మన ఇండియాని ఎగతాళి చేయడమే. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో మనోడి ఎక్కౌంట్లను బ్లాక్ చేయగలమో లేదో, ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించదో తెలీదు. ఇంత నిర్లజ్జగా ఓ మోసగాడు తిరుగుతుంటే చట్టంలోని నిబంధనలను సాకుగా చూపి వదిలేయడం దారుణం, ఖచ్చితంగా ఇది నేరమే..

Vijay Malya enjoying in foreign with his family. He posted a video of him with his son in social web site, he is enjoying IPL match, Really it is insulting to Indian government.