విద్యాబాలన్ కి దాహం తీరలేదట

2 Jun 2016విద్యా బాలన్ మరో బయోపిక్ కి సిధ్దమవుతోంది. డర్టీ పిక్చర్ తో జాతీయఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్న ఈ పరిణీత బాల ప్రస్తుతం వెటరన్ హీరోయిన్ గీతాబాలి బయోపిక్ లో కూడా నటిస్తోంది. ఏక్ అల్ బేలా పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత అదే ఊపులో విద్యా మీనాకుమారి క్యారెక్టర్ కూడా చేశేస్తానంటోంది. విద్యాబాలన్ అనగానే డర్టీ పిక్చరే గుర్తొస్తుంది. అందులో ఆమె ఫెర్ఫామెన్స్ ఆ రేంజ్ లో ఉంటుంది మరి. సిల్క్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఆ మూవీ రంగుల ప్రపంచంలోని చీకటివెలుగులను ప్రతిబింబించింది. దాంతో పాటే విద్యాబాలన్ కి జాతీయ ఉత్తమనటి పురస్కారం కూడా దక్కింది. దాని తర్వాత ఒకప్పటి హీరోయిన్ గీతాబాలి లైఫ్ ఆధారంగా వస్తున్న ఏక్ అల్ బేలాలో చేస్తోంది విద్యాబాలన్. ఐతే ఇది పూర్తి స్థాయి గీతాబాలి జీవితం కాదని, ఆమె చేసిన రెండు మూడు పాటల్లో మాత్రమే అలా కన్పిస్తానంటూ క్లారిటీ ఇస్తోంది విద్యా బాలన్.

రియల్ లైఫ్ క్యారెక్టర్లంటే ఎంతో ఇష్టమని చెప్తోంది విద్యాబాలన్..ఓ రియల్ లైఫ్ క్యారెక్టర్ ని చేసి మెప్పించడంలోనే అసలైన సవాల్ ఉందని, అది సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడంలో ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తానంటోంది. గీతాబాలి, విద్యాబాలన్ ఇద్దరివీ ఏమాత్రం పోలికలేని ముఖాలే అయినా, విద్యాధర్ భట్టే మేకప్ మహిమతో గీతాబాలి పోలికలు తెప్పించగలిగాడట. అలానే అల్ బేలాలోని చాంద్ ధాలే, కిడ్కీ టాలే పాటకి డ్యాన్స్ చేయడం విద్య ఎంతో ఎంజాయ్ చేసిందట. డర్టీ పిక్చర్, కహానీ ప్రమోషన్లలో ఆయా క్యారెక్టర్లతోనే ప్రెస్ మీట్ లకు వచ్చిన విద్యాబాలన్ అదే ట్రెండ్ ఏక్ అల్ బేలాకి కూడా ఫాలో అయిపోయింది. గీతాబాలి తర్వాత, తనకు మీనాకుమారి, మధుబాల, నర్గీస్ ఇలా ఎవరి బయోపిక్ లోనైనా నటించేందుకు విద్యాబాలన్ సై అంటోంది. మీనాకుమారి పై బయోపిక్ ఆఫర్ డర్టీ  పిక్చర్ తర్వాత వచ్చిందని, వెంట వెంటనే అలాంటివి వద్దనుకుందట  ఐతే. డర్టీ పిక్చర్ వచ్చి చాలా రోజులైంది కాబట్టి, ఇప్పుడు అదే  ఆఫర్ వస్తే ఎగిరి గంతేసి మరీ చేస్తుందట.

With Dirty Picture Vidya Balan got national award. Now she is again doing another bio pic movie. This is the life story of Githabaali life story.