బొంకకు వెంకయ్యా..!

18 Jun 2016


ఔను మరి ఇలానే అనాల్సి వస్తుంది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏ రోలు దగ్గర ఆ పాట పాడతారని తెలుసు కానీ, ఇలా ఇంతకీ డప్పు కొట్టుకుంటారని మాత్రం తెలీదు. మాదాపూర్ లో ఆయనకి అభినందన కార్యక్రమం ఏర్పాటైన సందర్భంగా  ఎమ్మెల్యేలు కానీ ఎంపిలు, ఎమ్మెల్సీలు ఎవరైనా సరే పార్టీలు మారితే వెంటనే అదే రోజు పదవులు కోల్పోయేలా చట్టం చేయాలని తన అమూల్యమైన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చేశారీయన. అటు ఉత్తరాఖండ్ లో ఇలా చేసే, పదమూడు మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఐనా అక్కడ పీఠం దక్కలేదు, చివరికి వారిలో 9మంది పదవులపై అనర్హత వేటు పడింది. మరోవైపు కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి కొన్నాళ్లక్రితం ఎంపీలను కూడా లాగేసుకున్న చరిత్ర కొన్ని బిజెపి పాలిత ప్రాంతాల్లో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పక్క పార్టీ ఎమ్మెల్యేలను ఎగేసుకుని మరీ లాగేసుకుంటున్నా అడిగే దిక్కు లేదు. పైగా దానికి డెవలప్ మెంట్ అనే సాకు ఒకటి. పైగా ఇకపై రాజకీయాలు చేయను, పోటీ చేయను అంటూ ప్రకటించడం ఎవరూ నమ్మడం లేదు, ఓ వేళ అదే నిజమైనా ఆయన్ని నమ్ముకుని ఏపీలో బిజెపి-టిడిపి కూటమికి ఓట్లు వేసిన జనాలకు టోపీ సంపూర్ణంగా పెట్టినట్లే అనుకోవాలి..

BJP central minister Venkaiah Naidu praising him self. His comment about party changing MLA is very funny. His NDA and TDP buying MLA, so his comments are very funny.