ఇద్దరు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు..మరి కోడెల కూడా ఫాలో అవుతారా

13 Jun 2016
ఉత్తరఖండ్ లో పాలిటిక్స్ మళ్లీ వేడెక్కాయ్. పోయిన నెలలో విశ్వాస పరీక్షలో బలం నిరూపించుకుని సిఎం హరీష్ రావత్ పీఠమెక్కగా, అప్పటి ఓటింగ్ లో పాల్గొన్న ఇద్దరు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటేశారు. మరి దాదాపు ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్న ఏపీలో కూడా స్పీకర్ కోడెల ఇలానే ఫాలో అవుతారో, లేక తనపై పడ్డ నిందలను మోస్తారో చూడాలి. ఉత్తరాఖండ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ్. ఈ లోపు అక్కడ జరగాల్సినంత రచ్చ జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడం, తర్వాత రాష్ట్రపతి పాలన విధించడం, సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ హరీష్ రావత్తే బలం నిరూపించుకుని పీఠం ఎక్కడం జరిగిపోయాయ్.

ఇప్పుడు తాజాగా అప్పటి విశ్వాస పరీక్షలో ఆయా పార్టీల విప్ ని ధిక్కరించి ఓటింగ్ చేసినందుకు  ఓ కాంగ్రెస్, ఓ బిజెపి ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశారు. అక్కడి స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్, రేఖఆర్య అనే లేడీ ఎమ్మెల్యే బిజెపికి ఓటు వేయగా, భీమ్ లాల్ ఆర్య అనే బిజెపి ఎమ్మెల్యే కాంగ్రెస్ కి క్రాస్ ఓటింగ్ చేసారు. ఇప్పుడీ ఇద్దరిపై వేటు పడింది. దీంతో ఉత్తరాఖండ్ లో అనర్హులైన ఎమ్మెల్యేల సంఖ్య 11 మందికి చేరింది. స్పీకర్ పై అవిశ్వాసం. ప్రభుత్వం పై అవిశ్వాసం తర్వాత ఆర్ధిక బిల్లు సందర్భంగా ఏపీలో కూడా వైఎస్సార్సీపీ విప్ జారీ చేసింది. ఐతే జంప్ జిలానీలు కొంతమంది హాజరు కాలేదు. కొంతమంది టిడిపికి అనుకూలంగా వేశారు. ఇలాంటి సిచ్యుయేషన్ లో ఏపీ స్పీకర్ ఎలా వ్యవహరిస్తారనేది చూడాలి. వేరే రాష్ట్రాల స్పీకర్ల తీరుని ఫాలో అవుతారో..లేక అలానే సాగదీస్తూ పోతారో మరి?

Utharkhand politics are very hot. Utharakhand Lokshabha speaker suspended two MLAs. Jumped MLAs must be very careful. It may be happen in Andhra Pradesh.