గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనలో చంద్రబాబును విచారించాలి..

22 Jun 2016


గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విచారించాలని మాజీ ఎమ్.పి ఉండవలి అరుణకుమార్ కోరారు. పుష్కరాల ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోమయాజులు విచారణ సంఘం ఎదుట ఉండవలి తన వాదన వినిపించారు.ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని ఆయన అన్నారు.చంద్రబాబును ఘాట్ నుంచి పంపించే క్రమంలో ఒక్కసారిగా బారికేడ్లు ఎత్తడంతో తొక్కిసలాట జరిగిందని అన్నారు.ఈ ఘటనలో బాద్యులైన అదికారులపై చర్య తీసుకుంటామన్న ముఖ్యమంత్రి వారందరిని ఆ తర్వాత సత్కరించారని అన్నారు.ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రిని కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కువ సేపు ఘాట్ లో ఉండడం వల్లే తొక్కిసలాట జరిగిందని అన్నారు.

On Godhavari Pushkara incident AP government's comity Somayajulu comity doing its process. Undavalli attended suggested to this comity to interrogate Chandrababu Naidu.