భండారీ ఫోన్ కాల్స్ కలకలం

3 Jun 2016


సంజయ్ భండారీ కేసు మరో మలుపు తిరిగే సూచన కన్పిస్తోంది. కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపరతి రాజు కార్యాలయానికి ఆయన ఫోన్ కాల్స్ వందల సంఖ్యలో ఉన్నాయని తేలింది. దీనిపై స్పందించిన మంత్రి విచారణకు ఆదేశించారు. మరోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ భండారికి సంబంధించిన బ్యాంక్ ఎక్కౌంట్లను, లావాదేవీలను సమర్పించాల్సిందిగా ఆదేశించింది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకి సంజయ్ భండారీతో లింకులున్నట్లుగా మూడ్రోజులు క్రితం ఆరోపణలు వచ్చాయ్. అవి కలిగించిన సంచలనం అలా ఉండగానే, భండారీ మంత్రి అశోక్ గజపతి రాజు కార్యాలయంతో అనేకసార్లు టచ్ లో ఉన్నట్లు తెలిసింది. పోయిన  ఏడాది భండారీతో అశోక్ గజపతి రాజు ఓఎస్‌డీ  అప్పారావు  వందలసార్లు మాట్లాడినట్లు దర్యాప్తు సంస్థలు తేల్చాయ్, దీన్న అప్పారావ్ కూడా నిర్ధారించారు.

దీంతో  ఇప్పుడు కేసు మలుపు తిరిగే అవకాశం కన్పిస్తోంది. మరోవైపు అశోక్ గజపతిరాజు ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామన్నారు. అలానే తాను సంజయ్ భండారీతో గతంలో ఓ ఎయిర్ షోలో కలిశానని కూడా ఆయన చెప్పారు. పు ఆర్దిక లావాదేవీలపై విచారణ ఎదుర్కొంటున్న సంజయ్ భండారీని తన బ్యాంకు అక్కౌంట్లు, లావాదేవీల వివరాలు సమర్పించాలని ఆదేశించింది ఫారిన్ ఎక్సేంచ్ మేనేజ్ మెంట్ యాక్ట కింద భండారీపై కేసు నమోదు చేసే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే ఆదాయపన్ను అధికారులు చేస్తున్న దర్యాప్తుకు సమాంతరంగా ఈడీ కూడా తన వేడి పెంచేస్తోంది. ఐటీ కార్యాలయం సంజయ్ భండారీపై మనీలాండరింగ్ చట్టం ప్రయోగించబోతోంది. ఇలా సంజయ్ భండారీకి అన్నివైపులా ఉచ్చు బిగిసేలా దర్యాప్తు సంస్థలు కదులుతున్నాయ్. ఈ నేపధ్యంలో మంత్రి అశోక్ గజపతిరాజు కార్యాలయంతో భండారీ ఫోన్ కాల్స్ కలకలం రేపుతున్నాయ్..

Now Sanjay Bhandari case is sensational in India. In this case so many political leaders were involved. Yesterday it was cleared that Sanjay is in contact with Ashok Gajapathi Raju.