ట్రంప్ కంత సీన్ లేదన్న ప్రముఖులు

2 Jun 2016


అమెరికా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షపదవికి  పోటీ పడుతున్న ట్రంప్ కి పెద్ద షాక్, విశ్వవిఖ్యాత సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్స్ అసలు ట్రంప్ కి  అంత ఆదరణ ఎలా దక్కుతుందో అర్ధం కావడంలేదంటూ సైటర్ వేశారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యల పట్ల ఎంత నిరసన ఉందో అర్ధమవుతోంది. మరోవైపు బాలీవుడ్ హాట్ స్టార్ సన్నీ లియోన్ కూడా ట్రంప్ ధోరణికి మద్దతు దొరకదని అనడం మరో విశేషం. ఒకరు హాట్ స్టార్, మరొకరు సైంటిస్ట్. ఇప్పుడీ ఇద్దరూ రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ పై తమ ఒపీనియన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అసలు ట్రంప్ అనే వ్యక్తికి ఈ స్థాయి ఆదరణ ఎలా వస్తుందో అర్ధం కావడంలేదన్నారు స్టీఫెన్ హాకింగ్. చక్రాల కుర్చీకి పరిమితమై తన సైన్స ప్రయోగాలే లోకంగా బతికే ఓ సైంటిస్టుకు కూడా చికాకు పుట్టిందంటే డొనాల్డ్ ట్రంప్ ఎంత కంపు కొట్టిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు.

ఎన్నో ఏళ్లుగా చదువుల కోసం, వ్యాపారం కోసం అమెరికాకి ఎంతోమంది వస్తున్నారని. వారికి వ్యతిరేకంగా ట్రంప్ మాట్లాడడం సరి కాదని స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి విపరీత ధోరణి కలిగిన డొనాల్డ్ కి పాపులారిటీ ఎలా వస్తుందో అర్ధం కావడంలేదన్నాడు స్టీఫెన్ హాకింగ్. ఇక ఒరిజినల్ గా యూఎస్ నుంచి వచ్చిన మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ హాట్ బేబ్ సన్నీ లియోన్ కూడా టైమ్ చూసి డొనాల్డ్ ట్రంప్ పై కామెంట్ విసిరింది. స్ప్లిట్ విల్లా అనే షో ఓపెనింగ్ లో ఆమెని ఈ టాపిక్ పై కదిలించగా, ట్రంప్ అనుసరిస్తున్న తీరు, ఆయన పాలసీలను అమెరికా ప్రజలు అంగీకరించరని చెప్పింది. అసలు ఇలాంటి భాష కానీ, అభిప్రాయాలు కానీ ఇంతకు ముందు ఎప్పుడూ వినేలేదంది సన్నీ. దీంతో ట్రంప్ క్యాంప్ లో ఒక్కసారే ఇలా ఇద్దరు సెలబ్రెటీలు తమ నేతపై విమర్శలు గుప్పించడంపై సైలెన్స్ నెలకొంది.

Trump is participating in next american elections. It created big rumor. Trump comments about foreign guest in America leads to this stage.