వెకిలితనానికి హాస్యానికి తేడా లేదా..?

2 Jun 2016


తన్మయ్ భట్ అనే వెకిలోడు తనని తాను కమెడియన్ గా చెప్పుకుంటాడు. ఐతే నిజానికి మన జబర్దస్త్, ఆలీతో జాలీగాలో ఎలాంటి జోకులేస్తారో వాటిని మించిన ద్వంద్వర్ధాలతో డైలాగులేస్తూ అదే కామెడీ అనుకోమంటారు. ఈ సంతతి అంతా, అందుకే ఇతగాడి వల్గారిటీ ఇప్పుడు హద్దులు దాటింది. వెటరన్ సింగర్ లతా మంగేష్కర్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌లను ఎగతాళి చేస్తూ కమెడియన్ తన్మయ్ భట్ తయారు చేసిన వీడియోను చూసినోళ్లు, హాస్యం వేరు వెకిలితనం వేరు. ఎవరిష్టం వచ్చినట్లు ఎవరినిపడితే వారిని అనుకరించేసి, స్వేఛ్చ అంటే కుదరదని మండిపడ్డారు. ఐతే సోనమ్ కపూర్ మాత్రం ఇతగాడిని వెనుకేసుకురావడం విశేషం. చూసి నవ్వుకోండి తప్ప ఎందుకు ఇలా వాడిని అసహ్యించుకుంటున్నారంటూ కామెంట్ చేశింది. ఐతే అదేదో ఈ భామని ఇమిటేట్ చేస్తే అప్పుడర్ధమయ్యేది.

విరాట్ కోహ్లీ, సచిన్ని తిట్టడం, లతామంగేష్కర్ పై సచిన్ ఆగ్రహించడం వంటి అర్ధం పర్ధంలేని వ్యాఖ్యానాలు జోడించి తన పైత్యం ప్రదర్శించాడు తన్మయ్, దీనిపై ముంబైలో కేసులు నమోదయ్యాయ్. అలానే చాలామంది సెలబ్రెటీలు కూడా ఈ అఁశంపై స్పందించారు. సచిన్ వైఫ్ అంజలి, వెకిలితనం హాస్యమంటే కుదరదని మండిపడగా, సోనూ నిగమ్ లతాజీ గురించి ఇలా ఎలా మాట్లాడతారంటూ కామెంట్ చేశాడు. అనుపమ్ ఖేరైతే తన్మయ్ ది హాస్యం కానేకాదని తేల్చేశాడు. మొత్తం మీద తన్మయ్ భట్ వీడియో అతగాడి వెకిలితనంతో పాటు, కామెడీ పేరిట జరిగే ఇలాంటి క్రియేషన్లకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

Thanmaye Bhat is a comedian. He always doing comedy with his double meaning dialogues. Recently he released a comedy video on Sachin Tendulkar and singer Latha Mangeshkar. It created sensation.