స్మగ్లింగ్ స్టార్

3 Jun 2016


ప్రాచీన సంస్కృతికి..చరిత్రకి ఆధారంగా నిలిచే విగ్రహాల స్మగ్లింగ్ రాకెట్ ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. దీంట్లో ఓ సినిమా నటికి కూడా భాగం ఉందనే వార్త ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది, దేవతా మూర్తుల ప్రతిమలను దేశాలు దాటించడంలో ఈ భామ హ్యాండ్ కూడా ఉందనడంతో ఎవరా నటి అనే  ఆసక్తి బయల్దేరింది. చెన్నై నుంచి విదేశాలకు విగ్రహాల స్మగ్లింగ్ చాలా ఏళ్లుగా సాగుతున్నదే, అలాంటి ముఠాలను పట్టుకుంటున్నా, ఎప్పటికప్పుడు కొత్త దారుల్లో ఈ స్మగ్లింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఆళ్వార్ పేటలో 50 కి పైగా విగ్రహాలను సీజ్ చేశారు పోలీసులు. వీటి విలువ 50 కోట్లుంటుందని అంచనా. ఈ రాకెట్ వెనుక దీనదయాళన అనే స్మగ్లర్ ఉన్నాడంటున్నారు. ఇతనికి ఓ సినిమా నటి కూడా సహకరించిందని వార్తలు గుప్పుమన్నాయ్. టూరిస్ట్ వీసా పేరుతో అనేక దేశాలు తిరుగుతున్న ఈ నటే, ఈ విగ్రహాలకు మోడల్ గా కూడా పని చేసిందట. ప్రాచీన హిందూ విగ్రహాలంటే విదేశాల్లో విపరీతమైన డిమాండ్, అందుకే స్మగ్లర్లు తీర ప్రాంతమైన చెన్నై నుంచి తమ దందా నడిపిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఈ ముఠా  సభ్యులపై నిఘా పెట్టిన చెన్నై కస్టమ్స్ పోలీసులు ఆళ్వార్ పేటలో దాడి జరిపారు.

దీనదయాళన అనే సదరు కేటుగాడు, చెన్నై నుంచి షిప్ ల తో తమ ఏంటిక్స్ స్మగ్లింగ్ ను యధేచ్చగా చేసేవాడట. మొత్తం ఈ బ్యాచ్ లో ఇప్పటికే అరడజను మందిని అరెస్ట్ చేసారు. ఈ కేసులో సుభాష్ కపూర్ అనే పేరు మోసిన స్మగ్లర్ ప్రమేయం కూడా ఉండొచ్చని పోలీసుల అనుమానం. 2012లో భారీగా స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ సుభాష్ కపూర్ జర్మనీ నుంచి అప్పట్లో పోలీసులు చెన్నైకి తీసుకొచ్చారు. న్యూయార్క్ లో ఆర్ట్ ఆఫ్ ది పాస్ట్ పేరుతో ఓ మ్యూజియం కూడా సుభాష్ రన్ చేస్తుంటాడు. ఇతనే ఇక్కడి దేవతామూర్తుల ప్రతిమలను ఫారిన్ కి తరలించి, అక్కడ సొమ్ము చేసుకుంటాడు. ఆరియలూర్ జిల్లాలో సంచలనం సృష్టించిన వరదరాజ పెరుమాళ్ టెంపుల్ చోరీ కేసులో ఇతగాడే మెయిన్. ఇతని సాయంతోనే దీనదయాళన కూడా స్మగ్లింగ్ చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

A star heroin in Tamil was caught in smuggling. She is going to foreign countries in visiting VISA. Recently she was caught in smuggling.