ఊసరవెల్లులుంటే టిఆర్ఎస్ నేతలే..!

10 Jun 2016


ఔను మరి, తమతో కలిసి ఉన్న వాళ్లంతా పులులు కడిగిన ముత్యాలు. లేనివాళ్లంతా దయ్యాలు, ఇదే తీరు టిఆర్ఎస్ పార్టీది. అందులో ఉన్న వాళ్లెవరైనా ఇలానే మాట్లాడతారు. పాపం కోదండరామిరెడ్డి ఇది తెలియకుండా అనవసరంగా తెలంగాణ ముఖ్యమంత్రి చేసిందేం లేదని తన ఒపీనియన్ మాత్రమే చెప్పాడు. ఆ మాత్రానికే ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం వారికే చెల్లింది.

అసలు పొలిటకల్ జేఏసీ లేకపోతే, కేసీఆర్ కి అంత మద్దతు ఎలా వచ్చేది? ఇప్పుడు డైలాగ్ మాత్రం జేఏసీ ఓ తోక అట. దాన్ని పట్టుకుని కోదండరామ్ వేలాడుతున్నాడట, ఇంత దారుణంగా మాట్లాడింది నాలుగు అడుగులు వేగంగా వేయలేని ఓ మంత్రి. అసలు మతే లేదని ఇంకో డైలాగ్. తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడం. తెలంగాణను అవమానించడమే అనడం ఎంత దుర్మార్గమో చూడండి. ఈయనగారి హయాంలోనే స్నేక్ గ్యాంగులు. ఎన్ కౌంటర్లు జరిగాయ్. ఆంధ్రోళ్ల పాలన అంటూ ఏడ్చిపోయే వాళ్లకి  ఇప్పుటి పాలనలో ఎలా ఎంత శాంతిగా బతుకుతున్నారో తెలియదా?

TRS leaders are always changing talks. At the time of Telangana separate state division fight, they use JAC. Now they taking about JAC badly.