దేవుడికి ఆర్ఎస్ఎస్ యూనిఫామా..?

8 Jun 2016


సూరత్ లోని స్వామి నారాయణ్  విగ్రహానికి ఆరెస్సెస్ యూనిఫామ్ ని అమర్చడంపై పై వివాదం తలెత్తింది. ఆలయ అధికారులు విగ్రహానికి ఖాకీ కలర్ నిక్కర్, వైట్ షర్ట్ తొడిగించారు. ఆరెస్సెస్ డ్రెస్ ఆ విగ్రహానికి అలంకరించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో ఈ విషయం  వెలుగులోకి వచ్చింది. దీంతో ఇదిలా చూస్తూ పోతే రేపు బిజెపి యూనిఫామ్ కూడా దేవుళ్లకి అమర్చుతారంటూ దుమారం రేగుతోంది.

విగ్రహానికిఅసలు ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ తాము అమర్చలేదని, ఓ భక్తుడు ఆభరణాలు ఇచ్చినప్పుడు ఎలాగైతే విగ్రహానికి ధరింపజేస్తామో, అలానే ఈ దుస్తులు కూడా వేశామని ఆలయసిబ్బంది చెప్పుకుంటున్నారు. ఐతే ఇది మాత్రం మితిమీరిన కాషాయీకరణకి నిదర్శనమని చూసిన ఎవరైనా చెప్పొచ్చు. గతంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే వారి వాదన అంగీకరించవచ్చు కానీ, ఇంతవరకూ ఏ విగ్రహానికి కూడా ఇలా యూనిఫామ్ వేసిన దాఖలా లేదు.

అందుకే ఆర్ఎస్ఎస్ చేసిన అకృత్యంగానే దీన్ని చూడాలి..ఓ విగ్రహాన్ని ఆరాధించడం వేరు..నిజంగా ఆ విగ్రహంలోనే దేవుడున్నాడని అనుకోవడం వేరు..ఐతే ఎంతోమంది నమ్మకం పెట్టుకుని పూజించే విగ్రహాలకు ఇలా వ్యక్తిగత ఇష్టాలను ఆపాదించడం భక్తి ఎలా అవుతుంది.

In Surat Swaminarayana Temple Swami statue was uniformed RSS uniform. This image created sensation in Hindus. This image was hot topic in Social media.