ప్రశ్నించడమే తప్పా..?

8 Jun 2016


ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడమే మేం చేసిన తప్పా..? అని వైసిపి ఎమ్మెల్యే జి శ్రీకాంత్‌ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజాసమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షంపై ఎదురుదాడి సరికాదన్నారు. రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఏడుసార్లు సమావేశమైందని, ఆ సమావేశాల్లో ఒక్కరోజైనా ప్రజా సమస్యలపై చర్చించారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంగా తాము సహకరిస్తామన్నా ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రెండేళ్ల పాలనపై ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని, ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని హితవు పలికారు.

On this Tuesday YSRCP MLA Srikanth Reddy fired on TDP government. In both assembly sessions TDP was not think about Peoples problems.