చంద్ర‌బాబుకి వ‌రుస షాక్ లు..!

6 Jun 2016


ఓవైపు కేంధ్రం స‌హక‌రించ‌డం లేదు, మ‌రోవైపు రాష్ట్రంలో ప‌రిస్థితి అంతంత‌మాత్రంగా ఉంది. ప్ర‌చారంతో ఎంత‌గా ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించాల‌ని చూసినా చివ‌ర‌కు ప్ర‌తిప‌క్ష నేత వ్యాఖ్య‌ల చుట్టూ ప్ర‌దిక్ష‌ణ‌లు చేయాల్సి వ‌స్తోంది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో చంద్ర‌బాబుకి మ‌రో షాక్ త‌గిలింది. రాజధాని నిర్మాణం మాట అలా ఉంచి ఇప్పుడు తాత్కాలిక నిర్మాణాలు కూడా ముందుకు సాగ‌డం క‌ష్టంగా మారుతోంది. ఏపీ రాజ‌దాని ప్రాంతం వెల‌గ‌పూడిలో తాత్కాలిక సెక్రటేరియేట్ పేరిట చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చాలా ప్ర‌హ‌స‌నం సాగిస్తోంది. అది ఉద్యోగుల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏకంగా హైద‌రాబాద్ లో ఆందోళ‌న‌ల‌కు దారితీస్తోంది. మ‌రోవైపు ఈ సెక్ర‌టేరియేట్ నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పు కోసం హ‌డ్కోని ఆశ్ర‌యించింది. కాంట్రాక్ట్ ని ఎల్ అండ్ టీ సంస్థ‌కు ఒక్కో చ‌ద‌ర‌పు గ‌జం నిర్మాణానికి సుమారు 3200 రూ.ల అసాధార‌ణ ధ‌ర‌కు అప్ప‌గించిన ప్ర‌భుత్వానికి ఇప్పుడు హ‌డ్కో షాకిచ్చింది. రుణం త‌మ వ‌ల్ల కాద‌ని చేతులెత్తేస్తోంది.

అందుకు చెబుతున్న కార‌ణాలు కూడా గ‌తంలో సింగ‌పూర్ నుంచి వ‌చ్చిన అభ్యంత‌రాల మాదిరిగానే క‌నిపిస్తున్నాయి. రాజ‌ధాని నిర్మాణ బాధ్య‌తలు తీసుకోవాలంటే భూముల‌న్నీ త‌మ పేరున బ‌ద‌లాయించాలంటూ అప్ప‌ట్లో సింగ‌పూర్ ష‌ర‌తు పెట్ట‌డం పెద్ద క‌ల‌క‌లం రేపింది. దాంతో ప్ర‌భుత్వం ముందుకెళ్ల‌లేక‌..వెన‌క్కి రాలేక స‌త‌మ‌త‌మ‌వుతోంది. స‌రిగ్గా ఇప్పుడు కూడా అలాంటి ప‌రిస్థితే వ‌చ్చింది. ఈసారి కూడా హ‌డ్కో రుణాలు ఇవ్వాలంటే భూములు రైతుల పేరు మీద ఉండ‌డం సాధ్యం కాదంటోంది. రైతుల పేరు మీద ఉన్న భూముల్లో చేప‌డుతున్న నిర్మాణాల‌కు రుణాలు ఇవ్వ‌డం సాద్యం కాద‌ని తేల్చేసింది. భూములు రిజిస్ట్రేష‌న్ లేకుండా ల్యాండ్ ఫూలింగ్ పేరిట సాగించిన ప్ర‌య‌త్నంలో చాలా సాధించామ‌ని సంతోసించిన ప్ర‌భుత్వానికి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

రాజ‌ధాని నిర్మాణం మాట అటుంచితే, క‌నీసం తాత్కాలిక స‌చివాలయ‌మైనా నిర్మించి ప్ర‌జ‌ల ముందుకెళ్లాల‌ని భావించిన చంద్ర‌బాబు ఇప్పుడు ప్ర‌తిపాద‌న‌లు మార్చుకోవాల్సిన అఘాయిత్యం ఏర్ప‌డుతోంది. 6 అంత‌స్తుల సెక్ర‌టేరియేట్ నిర్మాణ ప్ర‌తిపాద‌న మార్చుకోక త‌ప్పేలా లేదు. రుణం అంద‌క‌..ఖ‌జానా ఖాళీ అయిపోయింద‌ని ఇప్ప‌టికే య‌న‌మ‌ల ప్ర‌క‌టించేసిన నేప‌థ్యంలో ముందుకు సాగ‌డం క‌ష్టం కాబ‌ట్టి..అది అనివార్య‌మ‌వుతోంది. దాంతో తాత్కాలిక స‌చివాలయం కూడా చంద్ర‌బాబుకి త‌ల‌నొప్పులు పుట్టిస్తోంది. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే ల్యాండ్ ఫూలింగ్ లో తీసుకున్న భూముల‌తో రుణాలు అంద‌క‌పోతే భ‌విష్య‌త్తు ఏమిటో అన్న ఆందోళ‌న క‌ల‌వ‌ర ప‌రుస్తోంది.

Chandrababu Naidu government is in problems. Central government is not cooperating with Chandrababu Naidu, and Hyderabad employees are objecting to come to Amaravathi.