ఉడ్తా...పంజాబ్ గొడవేంటి

8 Jun 2016


ఉడ్ తా పంజాబ్ సినిమాకి సెన్సార్ చిక్కులు ఎదురవుతున్న నేపధ్యంలో రిలీజ్ పై సందేహాలు నెలకొన్నాయ్. రెగ్యులర్ సెన్సార్ బోర్డ్ 40 సీన్లు కట్ చేయాల్సిందిగా సూచించగా, సినిమా నిర్మాతలు రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. ఐతే అక్కడా వారికి చుక్కెదురైంది. మొత్తం 89 సీన్లు కట్ చేసి విడుదల చేయాలని రివైజింగ్ కమిటీ తేల్చింది. దీంతో సినిమా నిర్మాత గుండెల్లో రాయి పడ్డట్లైంది, మరోవైపు చిత్రసీమలోని ప్రముఖులు కూడా ఈ అంశంపై స్పందిస్తున్నారు. ఇంత భారీ ఎత్తున కట్స్ చెప్పడం సెన్సార్ బోర్డ్ ఓవరాక్షన్ అంటుంటే, పంజాబీలను అవమానించేలా ఉందని, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టే ఇన్ని కట్స్ చెప్తున్నామని సెన్సార్ బోర్డ్ చెప్తోంది. పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపధ్యంలో ఈ సినిమా విడుదలను కూడా పార్టీలు ఓ ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నాయ్.

ఉడ్ తా పంజాబ్ సినిమా వివాదంపై సెన్సార్ బోర్డ్ చీఫ్ స్పందించారు..ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ఒత్తిళ్లులేవని చెప్పారు. ఎన్నికలతో తమకి సంబంధం లేదని, సినిమా ఓ వర్గం వారిని అవమానపరచకూడదనే సెన్సార్ బోర్డు పని చేస్తుంద న్నారాయన. అంతకు ముందు అనురాగ్ కశ్యప్ కూడా  ఇదే అంశంపై స్పందిస్తూ, సెన్సార్ బోర్డ్ ఓవరాక్షన్ చేస్తుందన్నారు. ఉడ్తా పంజాబ్ మూవీలో పంజాబ్ లో జరిగే డ్రగ్ ట్రాఫికింగ్ గురించి చూపించామంటున్నారు దర్శకనిర్మాతలు. ఐతే టైటిల్ దగ్గర్నుంచి, సినిమాలో కొన్ని సంభాషణలు తీవ్ర అభ్యంతరకరంగా సెన్సార్ బోర్డ్ భావిస్తోంది. ఇదే అంశంపై దర్శకనిర్మాతలు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో సెన్సార్ బోర్డ్ వర్సెస్ ఉడ్తా పంజాబ్ వార్ లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.

Bollywood movie Udta Punjab movie facing Sensor problem. Sensor board told to cut 40 seens. So this movie team approached revised comity. Lets see what will happen.