సంజయ్ సంచులు

8 Jun 2016


జైలు జీవితంలో తాను నేర్చుకున్నదాన్ని జనానికి చూపించాడు నటుడు సంజయ్ దత్. ముంబై బ్లాస్ట్స్ కేసులో అరెస్టై ఎరవాడ జైల్లో గడిపిన సంజయ్ దత్ ఆ  కాలంలో రకరకాల చేతి వృత్తులు నేర్చుకున్నాడు. సత్ప్రవర్తనతో మెలిగినందుకు ఆర్నెల్లు ముందే బైటికి వచ్చిన సంజయ్, ఇప్పుడు ఛారిటీ ఈవెంట్లలో కాగితపు సంచులు ఎలా తయారు చేయాలో చూపించాడు. పేపర్ బ్యాగ్స్ మేకింగ్ లో సంజయ్ పనితనం చూసిన ఆడియెన్స్ కాసింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ముంబై బ్లాస్ట్ సమయంలో ఏకే 57 రైఫిల్ కలిగి ఉన్నందుకు దాదాపు ఆరేళ్ల విచారణ తర్వాత జైలుకి వెళ్లాల్సి వచ్చింది సంజయ్ దత్. ఆ తర్వాత తండ్రి సునీల్ దత్ పలుకుబడితోనో, కాంగ్రెస్ అండదండలతోనో బెయిల్ పై బైటికి వచ్చాడు. ఐతే ఎంత ప్రయత్నించినా చట్టం చేతికి దొరకకుండా పోలేకపోయాడు, చివరికి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. అందులో ఆర్నెల్ల ముందే బైటికి వచ్చాడు. మధ్యలో పెరోల్ పైనా బాగానే బైట గడిపాడని ఆరోపణలున్నాయ్. ఐతే జైల్లో గడిపిన ఆ కాలంలోనే ఇలా ఖైదీల శిక్షణ కార్యక్రమంలో మన ఖల్ నాయక్ ఇలా కాగితపు సంచులు తయారీలో టాలెంట్ సంపాందించాడు, ఇలా జనం ముందు ప్రదర్శించి ఔరా అన్పించుకున్నాడు.

Sanjay Dutt was released from jail three months back. At the time of jail life he learnt, how to make carry bags with paper. And he showing it in charity events.