తెలంగాణా లో అది అన్యాయం.. అదే ఆంద్రప్రదేశ్ లో శాసనం..

20 Jun 2016


మెజారిటీ ఏపీలో “సాక్షి’ ప్రసారాలు బంద్ అయ్యాయి. ముందుగా కాపు జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ ఛానల్ ప్రసారాలను అడ్డుకున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు దాదాపుగా అన్ని జిల్లాల పరిధిలోనూ సాక్షిని బంద్ చేసింది! ఎమ్ ఎస్ వోల ద్వారా సాక్షి ప్రసారాలను ఆపేశారు. మరి తెలంగాణలో రెండు ఛానళ్ల మీద ఈ తరహా నిషేధం పెట్టే సరికే తెలుగుదేశం పార్టీ ఎనలేని స్థాయిలో గగ్గోలు పెట్టింది. ఏబీఎన్, టీవీ 9 లను తెలంగాణ గవర్నమెంటు ఆపించే సరికి తెలుగుదేశం ఆ ఛానళ్ల తరపు గొంతు చించుకుంది. ప్రజాస్వామ్యంలో ఇదేమిటి? అని ప్రశ్నించింది. మరి అదే ప్రజాస్వామ్యంలోనే తామూ ఉన్నామన్న విషయాన్ని మరిచినట్టుగా తెలుగుదేశం పార్టీ ఏపీలో మాత్రం సాక్షి ప్రసారాలను అడ్డుకుంది!

మరి ముద్రగడ దీక్ష ముగిసేంత వరకూ ఈ నిషేధాన్ని కొనసాగించి.. ఆ తర్వాత నార్మల్ పొజిషన్ కు వస్తారా లేక ఇదే బాగుందని.. వచ్చే మూడేళ్ల వరకూ కూడా జగన్ టీవీ ఛానల్ ప్రసారాలకు చెక్ చెప్పి హ్యాపీగా ఫీలవుతారా? అనేది తేలాల్సి ఉంది.
రోజుకొక తెలుగుదేశం నేత ఈ షోకు ఫోన్ చేస్తున్నాడు! తామ వాదనను వినిపిస్తున్నాడు. మరి వాదన వినిపించడం మంచిదే. కానీ.. తెలుగుదేశం సాక్షి కి పలకం అంటూ.. మళ్లీ ఇలా కాల్స్ చేయడం మాత్రం ఆ పార్టీ విధానాలను చాటి చెబుతోంది. ఒకవైపు ఏబీఎన్ వంటి ఛానల్ తెలుగుదేశానికి అనుకూలమైనదని వైకాపా వాళ్లు ఆరోపిస్తూ ఉంటారు. అలాగని ఆ ఛానల్ ను నిషేధించాం అని వారు అనరు.

ఆ ఛానల్ చర్చా కార్యక్రమాల్లో వైకాపా వాళ్లు పార్టిసిపేట్ చేస్తారు. తెలుగుదేశమే.. నిషేధం అంటుంది, ప్రసారాలను అడ్డుకుంటుంది..ఇప్పుడు ముద్రగడ నిరాహరా దీక్ష ను మీడియా లో హైలైట్ కాకుండా తెలుగుదేశం పార్టీ అన్ని చానల్స్ లోను అడ్డుకుంటోంది. అయితే సాక్షి టీవీ లో మాత్రం ఇది చంద్రబాబు కు అ సాద్యం.అందుకే అదికారం చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు అదికారాన్ని ఉపయోగించుకోని ఆ చానల్ బంద్ చేయగలిగాడు. అందుకే ఇప్పుడు రాష్ట్రం లో ఎదో ఒక చోటా ప్రతి రోజూ ఖచ్చితంగా దర్నా జరుగుతోంది.

మళ్లీ ఆ ఛానల్ కే ఫోన్ చేసి మరి వాయిస్ వినిపిస్తుంది! మొత్తానికి మెజారిటీ మీడియా అండ ఉన్నా… జగన్ కు చెందిన ఒక్క ఛానల్ దెబ్బకే అధికార పార్టీ అసహనంతో రగిలిపోతున్న పరిస్థితి సుస్పష్టం.
ఈ పరిస్దితిని చూస్తూ ఉంటే నమ్మంచాలి వస్తుంది. జగన్ ప్రజల వద్ద పాలనలాగనే ప్రజల గుండెలో జగన్ ఉన్నాడు అన్న నిదర్శంగా నిరూపింస్తున్నారు. జగన్ ఎన్ని విధాలగా దెబ్బ తీసిన పోటీకి రెడీ అంటున్నాడు. ప్రజల పరిపాలన అంటే రాజన్న కొడుకు అయిన జగన్ కే సాధ్యము. ఎదీ ఎమైనా ఎబీఎన్,టీవీ 9 లను తెలంగాణా లో బంద్ చేస్తే అదీ తెలుగుదేశానికి అన్యాయం అన్పించింది. అదే అంద్రప్రదేశ్ లో సాక్షి ని బంద్ చేసి ఆ అన్యాయాన్ని శాసనం అని అంటున్నారు.

Chandrababu Naidu mis using his powers. He banned Sakshi programs in AP. When Telangana government banned some TDP channels, TDP fight for those channels.