సచిన్ కొడుకనే ఎంపిక చేశారా...?

2 Jun 2016


వెస్ట్ జోన్ అండర్ సిక్స్టీన్ టీమ్ కి సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎంపికపై కాసింత దుమారం రేగింది. అతనితో పాటు ప్రణవ్ ధన్వాడే కి చోటు దక్కకపోవడమే ఇందుకు కారణం, హైస్కూల్ లెవల్ లో ప్రణవ్ ధన్వాడే 1009 పరుగులు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అంతటి బ్యాట్స్ మెన్ ని ఎంపిక చేయకుండా, అర్జున్ టెండూల్కర్ ని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారంటూ సోషల్ మీడియాపై కొందరు కామెంట్స్ చేస్తుండగా, మరో 10 మంది ప్లేయర్లు కూడా ఎంపికయ్యారని, దీనిపై దుమారం వద్దని మరి కొందరు అంటున్నారు.

ఐతే ప్రణవ్ ధన్వాడే తండ్రి ప్రశాంత్ మాత్రం ప్రణవ్ కి 16ఏళ్లు దాటాయని, అనవసరంగా ఈ విషయంపై రగడ చేయొద్దని అన్నారు. అసలు ఈ వెస్ట్ జోన్ ఎంపిక ఎప్పుడో జరిగిపోయిందని, ప్రణవ్ ధన్వాడే థౌజండ్ రన్స్ కొట్టకముందే జరిగిందని, ప్రశాంత్ ధన్వాడే చెప్పాడు. ముందు ముంబై తరపున ఆడినవారే వెస్ట్ జోన్ టీమ్ లోకి వస్తారని, అలా ప్రణవ్ ఆడలేదు కాబట్టే ఎంపిక కాలేదని క్లార్టీ  ఇచ్చేశాడు. ఐతే కొంతమంది మాత్రం సచిన్ పెద్ద పలుకుబడి ఉన్నవాడు కాబట్టే, ఈ అన్యాయం జరుగుతుందంటూ కామెంట్లు చేసుకుంటూ పోతున్నారు.

Sachin Telndulkar son Arjun Tendulkar was selected in under 16 in Mumbai state. Now it is hot topic, Because of only  Sachin Tendulkar he was slelcted.