మహిళల చేతిలో బాబుకు చీపురు దెబ్బలు తప్పవు..

8 Jun 2016


ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చి, ప్రజలను మోసం చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె చంద్రబాబు నాయుడి రెండేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌లు గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగేసే రకాలని వ్యాఖ్యానించారు. అవినీతి అనకొండ చంద్రబాబు నాయుడైతే, కమిషన్ల కొండచిలువ అంటే లోకేశ్‌ బాబు అని వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు నాయుడు ఫైళ్లపై సంతకాలు చేస్తుంటే, లోకేశ్‌ సూట్‌-కేసులు సర్దుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ మాదిరే అభివ ద్ధి అంతా ఒక్క చోటేనని, చంద్రబాబుకు ఓట్లు వేయలేదని రాయలసీమపై పగ తీర్చుకుంటున్నారని ఆరోపించారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ చంద్రబాబు, లోకేశ్‌ బాబు ఎక్కడ భూములు దొరికినా బినామీ బాబుల పేరిట దోచుకుంటున్నారని ఆరోపించారు. డ్వాక్రా మహిళల కోసం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎంతో చేస్తే, చంద్రబాబు మాత్రం మహిళా సంఘాల్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. భవిష్యత్తులో మహిళల దగ్గర చంద్రబాబుకు చీపురు దెబ్బలు తప్పవన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు నాయుడిని నిలదీయాలని ప్రజలకు సూచించారు.

YSRCP MLA roja was fired on AP CM Chandrababu Naidu. Chnadrababu naidu and his son cheating AP people.