రవ్వంత రచ్చ

10 Jun 2016


తెలంగాణ టిడిపిలో మిగిలింది ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే. ఇతను ఎంత ఎగిరెగిరి పడ్డా, ఎలా ప్రతి ఇష్యుపై కేసీఆర్ పై విమర్శలు చేసినా? ఎగతాళికే గురవుతున్నాడు కానీ, ఏ మాత్రం గుర్తింపు రావడం లేదు. దానికి తోడు మనోడు చేసే ఓవరాక్షన్ కూాడ కాస్త అసహనం కలిగిస్తుందంటారు.

తాజాగా  తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లె కృష్ణారావు చేతిలోని మైక్ లాక్కోవడానికి ప్రయత్నం చేసి కాస్త రచ్చ చేశాడీ హీరో. కోసిగి మండలం బోగారం గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు.తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుతగులుతున్నారని మంత్రి విమర్శలు చేస్తున్న సమయంలో రేవంత్ ఒక్కసారిగా కుర్చీలోనుంచి లేచి మంత్రి చేతిలో ఉన్న మైక్ లాక్కోబోయాడు. దాంతో ఒక్కసారిగా టిడిపి, టిఆర్ఎస్ కార్యకర్తల మద్య ఉద్రిక్తత ఏర్పడింది. 

మంత్రి ప్రసంగాన్ని రేవంత్ రెడ్డి అడ్డుకోబోయిన వెంటనే  పోలీసులు అక్కడ అప్రమత్తం అయ్యారు. జూపల్లె ,రేవంత్ ల మద్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. రేవంత్ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారని టిఆర్ఎస్ నేతలు విమర్శించారు. అయినా రేవంత్ అలా మైక్ లాక్కోవడం కంటే ఇంకేం చేయలేరా.

Telangana TDP leader again always hot topic, recently he created sensation. He tried to take mike form Telangana minister Krishna Rao.