కదులుతున్న కోడెల డొంక..

30 Jun 2016


రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ కోడెలమ శివప్రసాదరావుపై వచ్చిన ఎన్నికల వ్యయం ఆరోపణలపై పూర్తిస్థాయి నివేదిక సిద్దం చేయడంపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తాను 11 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు స్వయంగా కోడెల చెప్పినట్లు వార్తా కథనాలు ప్రసారమైన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఐదు ఫిర్యాదులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి వచ్చాయి. ఇరదులో ఒకటి నేరుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాగా, మరో నాలుగు ఫిర్యాదులు పోస్టులో వచ్చినట్లు సిఇఒ భన్వర్‌లాల్‌ వెల్లడిరచారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో వాస్తవాలపై ఎన్నికల అధికారులు నివేదిక సిద్ధర చేస్తున్నారు. కోడెల చేసిన వ్యాఖ్యలు ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల్లో రావడంతో వాటి వీడియోలను కూడా అధ్యయనం చేస్తున్నారు. ఈ వివాదానికి సంబంధిరచి పత్రికల్లో వచ్చిన వార్తల వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ వివరాలు ఆరగ్ల భాషలోకి తర్జుమా చేసి ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిరచాలని నిర్ణయిరచారు. వైకాపా ప్రతినిధులను రోజా, అంబటి రాంబాబు ఇచ్చిన వీడియో క్లిప్పిరగ్‌లను కూడా పరిశీలిస్తున్నారు. దీరతోపాటుగా మరో నలుగురు వ్యక్తిగతంగా కూడా కోడెల శివప్రసాదరావుపై చేసిన ఫిర్యాదులను రాష్ట్ర ఎన్నికల అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

AP Speaker Kodela Siva Prasad comments about expensive in election are hot topic in media. YSRCP MLAs complained against Kodela to election commission.