ఆమె అందుకు సరిపోదట

3 Jun 2016


అందానికి మరో కొత్త నిర్వచనం రకుల్. అందుకే ఈ పంజాబీ భామను తెలుగు జనం అక్కున  చేర్చుకున్నారు, యూత్ గుండెల్లో పెట్టుకున్నారు. పాపులారిటీ రావడం కాస్తంత లేటైనా ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఆమెదే అగ్రస్థానం. రకుల్ తో నటించేందుకు కోటి రూపాయలు ఇచ్చేందుకు కూడా ఓ యంగ్ హీరో సిధ్దపడటం ఓ ఏడాది క్రితం విశేషం. ఐతే అది వర్కౌట్ అవలేదు, ఆ సినిమా లో వేరే హీరోయిన్ నటించింది. ఆ  చిన్నదాని కోసం అలా ఆత్రపడ్డ హీరోకి ఫ్లాపే దక్కింది. ఐతే ఇప్పుడంత క్రేజ్ ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, తనకి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ సెట్ అవ్వవని ఫీలౌతుంది. ఇదోరకంగా ప్రొడ్యూసర్లకి సోపేసే పనే, ఎందుకంటే అనుష్కలా అలాంటి సినిమాలే చేసుకుంటే ఏడాదికి రెండుకి మించి దొరకవ్, పైగా హీరోలు కూడా ఆమెతో నటించేందుకు పెద్దగా ముందుకు రారు. అదే ఇప్పుడు చేస్తున్న సినిమాల్లాంటివి అయితే ఫుల్ గ్లామరస్ గా చేసుకుంటూ పోవచ్చు, పిజికల్ గా పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు.

కెరీర్ బిగినింగ్ లో ఆరులక్షలు మాత్రమే తీసుకున్నానంటున్న రకుల్ ఇప్పుడు టెన్ మిలియన్ హీరోయిన్ ఐపోయింది. పైగా తనలోని బిజినెస్ ఉమన్ ని కూడా బైటికి తీసింది ఇప్పటికే. ఫిట్ నెస్ ఫ్రాంచైజీ నడుపుతున్న రకుల్ తెలివీతేటలకు ఎవరైనా సలాం చెప్పాల్సిందే. హవా సాగినన్నాళ్లు మాత్రమే ఇస్తారు కాబట్టి, ఎక్కువ డిమాండ్ చేయడంలో తప్పేంలేదు. ఓ సారి ఫేడౌట్ అయ్యిందా ఇక ఆమె పని అంతే సంగతులు, సో ఆల్ ది బెస్ట్ రకుల్.

Rakul Preet Singh is care of address for glamour role. Young heroin are looking to do movies with Rakul Preet Singh. Recently She started a business. She is telling i am not suitable for heroin oriented movies.