రామ్ గోపాల్ వర్మకి షాకిచ్చిన రజనీకాంత్ ఫ్యాన్స్

18 Jun 2016


సూపర్ స్టార్ రజనీ చరిష్మా గురించి స్టార్ డమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే, అలాంటి హీరోపై అవాకులు చెవాకులు పేలితే ఫ్యాన్స్ చూస్తూ ఊరుకుంటారా దుమ్మెత్తిపోయరూ, అదే జరిగింది రామ్ గోపాల్ వర్మకి. అలానే ఆయన హెల్త్ పై కథనాలు  రాసినందుకు స్వయంగా శ్రీలంక మీడియా కూడా సారీ చెప్పింది. అదీ సూపర్ స్టార్ డమ్ అంటే, కొత్తగా రిలీజైన కబలి సాంగ్ టీజర్ కూడా భీకరమైన హిట్లు సాధిస్తూ ఎదురులేని రజనీ మేనియాకి నిదర్శనంగా నిలిచింది. సూపర్ స్టార్ కి ఇప్పుడు వయస్సు 66, ఐతే అదేం స్క్రీన్ పైన కన్పించదు. రియల్ లైఫ్ లోనూ అంతే, చకచకా నడుస్తూ ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉండే రజనీ స్క్రీన్ పై ఎంత కలర్ ఫుల్ గా కన్పిస్తాడో బైట అంత సింపుల్. ఐతే ఇప్పుడు రజనీకాంత్ హెల్త్ బావోలేదంటూ కొంతకాలంగా టాక్ నడుస్తోంది. అదంతా ఒట్టిదేనని, ఆయన చక్కగా ఉన్నారంటూ రజనీ కుటుంబసభ్యులు స్పష్టం చేశారు. అలానే సోషల్ నెట్ వర్కింగ్  సైట్లలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు కూడా. ఇదే అంశాన్ని శ్రీలంక మీడియా కూడా హైలెట్ చేసింది. రజనీకాంత్ కి ఏదో అయిపోయిందన్నట్లుగా హడావుడి చేసి, ఆనక సారీ చెప్పింది. ఓ పొరుగుదేశం హీరోకి మరో దేశం ఇలా క్షమాపణలు చెప్పడం ఒక్క రజనీకాంత్ విషయంలోనే చూశాం. 

మరోవైపు రజనీకాంత్ ని టచ్ చేస్తే, ఏదోలా పబ్లిసిటీ వస్తుందనుకున్న రామ్ గోపాల్ వర్మకి కూడా ఆయన ఫ్యాన్స్ షాకిచ్చారు. సందర్భశుద్ది లేకుండా అమితాబ్ బచ్చన్ టెత్రీన్ మూవీలో రజనీ నటిస్తే, ఎలా ఉంటుందో అంటూ ట్వీట్లు చేసిన రామ్ గోపాల్ వర్మకి రజనీ ఫ్యాన్ వెంకట్ ప్రభు దిమ్మతిరిగే కౌంటరిచ్చారు. మీకు ఫ్లాప్ మూవీస్ తీయడమే తెలుసంటూ ట్వీట్ చేశాడాయన. అంత ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ సినిమా ఆడియో ఆయన లేకుండా విడుదల కావడం ఇదే తొలిసారి, ఆయన అనారోగ్యమే ఇందుకు కారణం. రజనీకాంత్ కి ఆరోగ్యం బావోలేదనేది తెలిసిన విషయమే అయినా, అది విపరీతంగా ప్రచారం కావడంతోనే ఆయన కుటుంబసభ్యులకు చిర్రెత్తుకొచ్చింది, అందుకే ఈ విషయంలో ఎలాంటి పుకార్లని నమ్మవద్దని చెప్పాల్సి వచ్చింది. దీంతో ఫ్యాన్స్ లో ఆందోళన సద్దుమణిగినా, కబాలి టీజర్ సెన్సేషన్ మాత్రం కంటిన్యూ అవుతోంది.

Ramgopal Varma is always creating popularity him self with twits. Recently he commented about Rajanikanth health. Rajani fan Venkat Prabhu gave counter to him.