ష్..పవన్ నిద్రోతున్నాడు లేపకండి

15 Jun 2016


అవును..ప్రతిదానికీ ఓ యిజం ఉంది, అందులో హజమూ ఉంది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు రాయడానికి లేదు, వారిపై విమర్శలు చేయడానికి లేదు. అదే వాళ్లైతే వేళా పాళాలేకుండా వచ్చేస్తారు. అడగాల్సినవి అడిగేసి, అంతే ఫాస్ట్ గా దుప్పటి కప్పేసుకుంటారు. అంతటితో వాళ్ల గురుతరమైన బాధ్యత అయిపోతుంది. చేయాల్సిందంతా ప్రతిపక్షనేత జగన్ మాత్రమే, ఎందుకంటే ఆయనకే బాధ్యత ఉంది. మిగిలిన వాళ్లు అంతా నిమిత్త మాత్రులు. అచ్చంగా ఇదే తీరులో ఉంది, కొంతమంది నేతల తీరు, ప్రతిదానికీ నేనున్నా మీకున్నా అంటూ వచ్చే ఆ సేననేత, ఇప్పుడు ఖచ్చితంగా ఆర్నెల్లకోసారి కుంభకర్ణుడిలా లేస్తాడు. అదలా జరగాల్సింది కాదు, ఇదిలా కాదు అని ఫీలర్లు వదులుతారు. కనీసం కెమెరాల ముందుకు రావాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఓ ట్వీట్ ఇస్తారు, చాలు దాంతో ఆయనగారి అభిమానగణం రెచ్చిపోతారు. అదుగో చూసారా, మా నేత గొంతు విప్పాడు. ఇక నేతల పంచలు తడుస్తాయని జబ్బలు చరుచుకుంటారు. ఐతే ఇప్పుడు మరి ఆయనగారి వర్గ నేతే మంచిదో చెడుదో ఓ లక్ష్యం కోసం దీక్ష చేస్తున్నాడు. దానిపై ఓ చిన్న ట్వీటు లేదు, ఘాటు కామెంట్ లేదు. 

మరి స్పందించే అవసరమే లేదో, లేక ఇంకా టైమ్ రాలేదో..తెలీదు..లేదంటే ఏ కామెంట్ చేస్తే, ఏమవుద్దో అన్న కంగారు ఉందేమో లేదు లేదు లెక్కకి మించిన అభిమానగణమున్న ఆయనకి ఆ భయం ఉండదు ష్యూర్. మరి ఎప్పుడు ఏ అంశంమీద స్పందిస్తారో, మన గణాచారులకు తెలిస్తే బ్యానర్లు రెడీ చేస్కుంటారు కదా. రాజధాని రైతులైనా, కాపు రిజర్వేషన్లైనా, ఏపీకి (రాని) ప్రత్యేకహోదా అయినా, పక్క రాష్ట్రంతో సంబంధాలపైనైనా, ఏదైనా మాట్లాడగల హక్కున్న నేత(నటుడో) ఎప్పుడు మాట్లాడతారో చెప్పండి రాస్కుంటాం. ఇవన్నీ మేం చెప్పేది కాదు, అటు కాంగ్రెస్ నేత వీహెచ్ అడుగుతున్నాడు. ఇటు వైసీపీ నేతలు అడుగుతున్నారు, ఐనా ఆన్సర్ మీరు వాళ్లకి కాదు..మీ మనసుకి ఇచ్చుకోండి చాలు.

Pavan Kalyan is in sleep mode. Present he is not talking about AP, and its latest issues.